Satwiksairaj – Chirag Shetty | సాత్విక్ – చిరాగ్ జోడీకి కెరీర్ అత్యుత్తమ ర్యాంక్
Satwiksairaj - Chirag Shetty : భారత స్టార్ డబుల్స్ ద్యయం సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj) - చిరాగ్ శెట్టీ(Chirag Shetty) కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బీడబ్ల్యూఎఫ్(bwf rankings) విడుదల చేసిన పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మూడో వరల్డ్ టూర్ టైటిల్ గెలిచిన ఈ జంటకు కెరీర్ అత్యుత్తమ ర్యాంక్...
Satwiksairaj – Chirag Shetty : భారత స్టార్ డబుల్స్ ద్యయం సాత్విక్ సాయిరాజ్(Satwiksairaj) – చిరాగ్ శెట్టీ (Chirag Shetty) కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ సాధించారు. బీడబ్ల్యూఎఫ్(bwf rankings) విడుదల చేసిన పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో రెండో స్థానం సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది మూడో వరల్డ్ టూర్ టైటిల్ గెలిచిన ఈ జంటకు కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ ఇదే కావడం విశేషం. రెండు రోజుల క్రితం కొరియా ఓపెన్(Korea Open)లో టైటిల్ విజేతగా నిలవడంతో సాత్విక్ – చిరాగ్ జోడీ ర్యాంక్ మెరుగుపడింది.
ఇండోనేషియా ఓపెన్ ట్రోఫీ తర్వాత సాత్విక్ – చిరాగ్ మూడో ర్యాంక్కు ఎగబాకారు. ఫైనల్లో టాప్ సీడ్ ఓడీకి షాకిచ్చి చాంపియన్గా నిలిచారు. చైనాకు చెందిన లియాంగ్ వే కెంగ్, వాంగ్ చాంగ్ జంటను చిత్తు చేసి సగర్వంగా ట్రోఫీ అందుకున్నారు. దాంతో ఒక ర్యాంక్ మెరుగుపరుచుకున్నారు.
వరల్డ్ టూర్ ఫైనల్లో రికార్డు
ఈ ఏడాది ఆరంభం నుంచి సాత్విక్ – చిరాగ్ జంట దుమ్మురేపుతోంది. వరుస ట్రోఫీల్లో సంచలన విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తోంది. వీళ్లు ఈ ఏడాది తొలిసారి స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గారు. సాత్విక్- చిరాగ్ జోడీకి వరల్డ్ టూర్ ఫైనల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఫైనల్ చేరిన ఈ జోడీ ఏకంగా ఏడు పర్యాయాలు చాంపియన్గా నిలిచింది.

అంతేకాదు వీళ్లిద్దరూ తొలిసారిగా ఇండోనేషియా సూపర్ 1000 టోర్నమెంట్ టైటిల్ సాధించారు. దాంతో, ఇండోనేషియా ఓపెన్ టైటిల్ అందుకున్న మొదటి భారత డబుల్స్ జోడీగా రికార్డు సృష్టించారు. అంతేకాదు హైదరాబాద్ ఓపెన్(2018), థాయ్లాండ్ ఓపెన్(2019), ఫ్రెంచ్ ఓపెన్(2022) డబుల్స్ విజేతగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
West Indies | రెండేళ్ల తర్వాత జట్టులోకి హిట్మెయిర్.. వన్డే సిరీస్కు విండీస్ బృందం ఇదే
World Test Championship: డ్రాతో రెండో స్థానానికి ఇండియా.. టాప్లో పాకిస్థాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

