West Indies : టీమిండియాతో వన్డే సిరీస్(ODI series) కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు గట్టి జట్టును సిద్ధం చేస్తున్నారు. టెస్టు సిరీస్(Test Series)లో ఘోర పరభావం దెబ్బతో కీలక ఆటగాళ్లను తిరిగి జట్టులోకి తీసుకున్నారు. అవును.. ధనాధన్ ఇన్నింగ్స్‌లకు పేరొందిన షిమ్రాన్ హెట్మెయిర్(Shimron Hetmyer), ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్(Oshane Thomas)లను వన్డేలకు ఎంపిక చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత వీళ్లకు పిలుపు రావడం విశేషం.
‘హెట్మెయిర్, ఒషానే థామస్‌లను మళ్లీ జట్టులోకి స్వాగతిస్తున్నాం. ఇంతకుముందు వీళ్లిద్దరూ అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. విజయవంతం కూడా అయ్యారు. వీళ్లు జట్టు కూర్పులో సరిగ్గా సరిపోతారని నమ్ముతున్నాం’ అని చీఫ్ సెలెక్టర్ డెస్మాండ్ హేనేస్(Desmond Haynes) ఓ ప్రకటనలో తెలిపాడు.
హెట్మెయిర్, ఒషానే థామస్
పేసర్ జయ్డెన్ సీల్స్(Jayden Seales), లెగ్ స్పిన్నర్ యన్నిక్ కరియ(Yannick Cariah)లకు కూడా 15మంది బృందంలో చోటు కల్పించారు. వీళ్లిద్దరూ ఈమధ్యే సర్జరీ నుంచి కోలుకుని రిహబిలిటేషన్ సెంటర్లో ఫిట్నెస్ సాధించారు. మరో స్పిన్నర్ గుడకేశ్ మోతీ కూడా వన్డే జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. గాయపడిన ఆల్‌రౌండర్ కీమో పాల్, మాజీ కెప్టెన్ నికోలస్ పూరన్, సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు వన్డే సిరీస్‌కు దూరం అయ్యారు. జూలై 27 నుంచి వన్డే సిరీస్ నుంచి ప్రారంభం కానుంది.
వెస్టిండీస్ వన్డే స్క్వాడ్ : షై హోప్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్(వైస్ కెప్టెన్), అలిక్ అథనజె, యాన్నిక్ కరియ, కేసీ కార్టి, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయిర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడకేశ్ మోతీ, జేడెన్ సీలెస్, రొమారియో షెపర్డ్, కెవిన్ సింక్లెయిర్, ఒషానే థామస్.
విండీస్ జట్టు ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) పోటీలకు అర్హత సాధించలేదు. జింబాబ్వేలో జరిగిన క్వాలిఫై పోటీల్లో చిన్న జట్ల చేతిలో ఓటమితో ఇంటిబాట పట్టింది. సూపర్ ఓవర్లో నెదర్లాండ్స్ టీమ్ వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఒకప్పుడు మేటి జట్లలో ఒకటైన వెస్టిండీస్ ప్రపంచ కప్ ఆడకపోవడం అనేది 17 ఏళ్లలో ఇదే తొలిసారి.
2023 వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించని వెస్టిండీస్ జట్టు
కీరన్ పోలార్డ్, హిట్మెయిర్, నికోలస్ పూరన్, రోమా పావెల్ వంటి పవర్ హిట్టర్లకు కొదవ లేని ఆ జట్టు గత కొంత కాలంగా చెత్త ప్రదర్శనతో విమర్శల పాలవుతోంది. రెండు సార్లు వన్డే ప్రపంచకప్, టీ20 వరల్డ్ కప్ చాంపియన్ అయిన ఆ జట్టుకు మునపటి వైభవం తెచ్చేందుకు సెలెక్టర్లు ప్రయత్నిస్తున్నారు.