Cricketers Homes | కళ్లు జిగేల్మనేలా క్రికెటర్ల ఇళ్లు.. ఇంద్రభవనంలాంటి కోహ్లీ ఇంటిని చూశారా..!
Cricketers Homes : భారత క్రికెటర్లు(Indian Cricketers) ఆదాయ ఆర్జనలో ఎవరికి తీసిపోరు. ఓవైపు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు(BCCI Annual Contract)లతో పాటు ప్రముఖ కంపెనీలతో వాణిజ్య ఒప్పందాలతో కోట్లు గడిస్తున్నారు. దీనికి తోడు తమకు ఇష్టమైన రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వందల కోట్లు సంపాదిస్తున్నారు. అయితే.. ఖరీదైన ఇల్లు ఉన్న క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నఅభిమానుల మెదళ్లను తొలుస్తూనే ఉంటుంది. అతను మరెవరో కాదు...
Cricketers Homes : భారత క్రికెటర్లు(Indian Cricketers) ఆదాయ ఆర్జనలో ఎవరికి తీసిపోరు. ఓవైపు బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు(BCCI Annual Contract)లతో పాటు ప్రముఖ కంపెనీలతో వాణిజ్య ఒప్పందాలతో కోట్లు గడిస్తున్నారు. దీనికి తోడు తమకు ఇష్టమైన రంగాల్లో పెట్టుబడులు పెడుతూ వందల కోట్లు సంపాదిస్తున్నారు. ఒకరిని మించి ఒకరు అత్యాధునిక వసతులతో ఇండ్లు నిర్మించుకుంటున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా, ఖర్చుకు వెనుకాడకుండా కార్పొరేట్ శైలిలో ఇండ్లను తీర్చిదిద్దుకుంటున్నారు. అయితే.. ఖరీదైన ఇల్లు ఉన్న క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్నఅభిమానుల మెదళ్లను తొలుస్తూనే ఉంటుంది. అతను మరెవరో కాదు.. స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli). అవును అతడికి కళ్లు చెదిరే ఇళ్లు ఉన్నాయి.
రికార్డుల వేటలోనే కాదు ఖరీదైన ఇళ్ల విషయంలోనూ కోహ్లీ అందరి కంటే ముందంజలో ఉన్నాడు. ఢిల్లీని ఆనుకుని ఉన్న గురుగ్రామ్(Gurugram Home)లో కోహ్లీ, అనుష్కశర్మ (Virat Kohli -Anushka Sharma) దంపతులకు రూ.80 కోట్ల విలువైన భవంతి ఉంది. డీఎల్ఎఫ్ ఫేజ్-1 సీ బ్లాక్‌లో ఉన్న ఈ ఇళ్లు చూస్తే కండ్లు జిగేల్ అనాల్సిందే. 10,000 చదరుపు అడుగుల సామర్థ్యంతో నిర్మించిన బంగ్లాలో అన్ని రకాల వసతులు ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, జిమ్నాయిజం, మార్బుల్ ఫ్లోరింగ్, గ్లాస్ డెకార్, బార్ ఉన్నాయి.
కళ్లు చెదిరేలా ఉన్న యువరాజ్‌సింగ్ ఇల్లు

లగ్జరీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా కోహ్లీ, అనుష్క ఈ భవనాన్ని ముచ్చట పడి డిజైన్ చేసుకున్నారట. మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్(yuvraj singh) రూ.64 కోట్ల ఇల్లుతో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబైలో అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న యువీ ఫ్లాట్ బాగుంటుదని టాక్. క్రికెట్ ఐకాన్ సచిన్ టెండూల్కర్(sachin tendulkar) భవంతి విలువ రూ.35 కోట్ల కాగా, రాంచీలో ఉన్న మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) ఫామ్‌హౌ ధర రూ. 6 కోట్లు అని సమాచారం.
ఇవి కూడా చదవండి
Ashwin – Bhuvaneshwar | పొట్టి క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్న అశ్విన్, భువనేశ్వర్.. కారణం అదేనా..?
Madan Lal | హర్మన్‌ప్రీత్ తీరుపై లెజెండరీ క్రికెటర్ ఆగ్రహం.. నిషేధం విధించాలని ట్వీట్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

