ఢిల్లీ: సౌదీ అరేబియాలోని దమామ్ వేదికగా జరిగిన అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో చివరి రోజు భారత్‌కు తొలి స్వ ర్ణం దక్కింది. జావెలిన్ త్రో లో హిమా న్షు.. దేశానికి తొలి పసిడిని అందించాడు. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రాను అమితంగా అభిమానించే 17 ఏండ్ల ఈ హర్యానా కుర్రాడు.. 67.57 మీటర్ల త్రో తో బంగారు పతకం సాధించాడు. టోర్నీ ఆఖరిరోజైన శనివారం భారత్‌కు హిమాన్షు స్వర్ణంతో పాటు మరో మూడు పతకాలు దక్కాయి. పురుషుల హైజంప్‌లో దేవాక్ రజతం గెలవగా మహిళల 200 మీటర్ల రేసులో ఆర్తికి కాంస్యం, మెన్స్ మెడ్లీ రిలే జట్టు సిల్వర్‌తో మెరిసింది. ఒక స్వర్ణం, ఐదు రజతాలు, ఐదు కాంస్యాలతో (మొత్తం 11) భారత్ ఈ టోర్నీని ఘనంగా ముగించింది.