నేవీ ముంబై: టీ20 ప్రపంచకప్‌లో అసలు పోరుకు ముందు భారత్ అదరగొట్టింది. సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీమ్ఇండియా..దక్షిణాఫ్రికాతో వామప్ మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన పోరులో భారత్ 30 పరుగుల తేడాతో సఫారీలపై ఘన విజయం సాధించింది.
తద్వారా మెగాటోర్నీకి ముందు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. తన సూపర్‌ఫామ్‌ను కొనసాగిస్తూ ఇషాన్‌కిషన్(20 బంతుల్లో 53, 2ఫోర్లు, 7సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీకి తోడు తిలక్‌వర్మ (19 బంతుల్లో 45, 3ఫోర్లు, 3సిక్స్‌లు) బ్యాటింగ్‌తో టీమ్ఇండియా తొలుత 20 ఓవర్లలో 240/5 స్కోరు చేసింది. వీరిద్దరికి తోడు అక్షర్‌పటేల్(35 నాటౌట్), కెప్టెన్ సూర్యకుమార్‌యాదవ్(30), హార్దిక్ పాండ్యా(30) రాణించడంతో భారత్‌కు భారీ స్కోరు సాధ్యమైంది.
దేశవాళీ ఫామ్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తూ జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్..సఫారీలపై పిడుగులా విరుచుకుపడ్డాడు.మరోవైపు గాయం నుంచి కోలుకున్న హైదరాబాదీ తిలక్‌వర్మ తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. యాన్సెన్, బాచ్, నోకియా, ఎంఫకే ఒక్కో వికెట్ తీశారు. లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 210/7 స్కోరుకు పరిమితమైంది. స్టబ్స్(45 నాటౌట్), రికల్టన్(44) ఆకట్టుకున్నారు. ఆఖర్లో స్టబ్స్.దూబేను లక్ష్యంగా చేసుకుంటూ సిక్స్‌లతో హోరెత్తించాడు.