Ind Vs Nz | ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్‌లో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. వాంఖడే వేదికగా (Wankhede Stadium) ఆతిథ్య భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్ల మధ్య సెమీస్ పోరుకు వేళైంది. మధ్యాహ్నం 2 గంటలకు రెండు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌కు ముందు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
వాంఖడే స్టేడియంలో భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ జరిగే సమయంలో హింసాత్మక ఘటన చోటు చేసుకోనుంది (threat of nefarious incident) అంటూ ఓ అజ్ఞాత వ్యక్తి ఎక్స్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు తుపాకీ, హ్యాండ్ గ్రనేడ్, బుల్లెట్ ఉన్న ఫొటోను ముంబై పోలీసులకు ట్యాగ్ చేశాడు. ఈ బెదిరింపు పోస్ట్‌తో ముంబై పోలీసులు (Mumbai Police) వెంటనే అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.
Mumbai Police say, “An unidentified person posted a threat message to Mumbai Police on X (formerly Twitter) that a nefarious incident would be executed during the India vs New Zealand at Wankhede Stadium today. Strict vigilance is being done in the area around the stadium and…
— ANI (@ANI) November 15, 2023
చరిత్రాత్మక వాంఖడే స్టేడియం వేదికగా బుధవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన సెమీఫైనల్ పోరు జరుగనుంది. లీగ్ దశలో కివీస్‌ను చిత్తుచేసిన టీమ్ఇండియా అదే ఆత్మవిశ్వాసంతో మరోమారు విజయంతో ఫైనల్ బెర్తు దక్కించుకోవాలని చూస్తున్నది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో రోహిత్‌సేన అజేయంగా నిలువగా, కివీస్ ఐదు విజయాలు, నాలుగు ఓటములతో నాలుగో స్థానంతో నాకౌట్ రేసులో నిలిచింది.
2019 వరల్డ్‌కప్ సెమీస్‌లో కివీస్ చేతిలో ఇండియా ఓడింది. ఇక 2021 టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా ఇండియా ఓటమి చూవిచూసింది. కానీ తాజా టోర్నీలో మాత్రం రోహిత్ సేన టాప్ ఫామ్‌లో ఉంది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌లను గెలుచుకున్నది. బ్యాటర్లు, బౌలర్లు అందరూ రాణిస్తున్నారు. రసవత్తరంగా సాగే ఆ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
Also Read..
Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. బీహార్ యువకుడిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Namitha | చీటింగ్ కేసులో నటి నమిత భర్తకు సమన్లు