Namitha | చీటింగ్ కేసులో నటి నమిత భర్తకు సమన్లు
Namitha | ప్రముఖ నటి నమిత (Namitha) భర్త వీరేంద్ర చౌదరి (Virendra Chaudhary) ఓ చీటింగ్ కేసు (Fraud case)లో చిక్కుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల మోసానికి సంబంధించిన కేసులో ఆయనకు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు (Summons) జారీ చేశారు.
Namitha | ప్రముఖ నటి నమిత (Namitha) భర్త వీరేంద్ర చౌదరి (Virendra Chaudhary) ఓ చీటింగ్ కేసు (Fraud case)లో చిక్కుకున్నారు. దాదాపు 50 లక్షల రూపాయల మోసానికి సంబంధించిన కేసులో ఆయనకు తమిళనాడు సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు సమన్లు (Summons) జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడి (Ministry of Micro Small and Medium Enterprises) పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్ జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాలస్వామి అనే వ్యక్తికి ఆశ చూపాడు. ఇందుకోసం గోపాలస్వామి దగ్గరి నుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయితే, ఆ పదవికి నటి నమిత భర్త చౌదరి ఇటీవలే నియమితులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గోపాల స్వామి తాను మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ముత్తురామన్‌తోపాటు కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ యాదవ్‌ను పోలీసులు గత 31న అరెస్ట్ చేశారు. ఇదే కేసుకు సంబంధించి తాజాగా సేలం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు వీరేంద్ర చౌదరికి నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Also Read..
Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Xi Jinping | ఆరేళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌పై అనుచిత కామెంట్.. క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

