Xi Jinping | ఆరేళ్ల తర్వాత తొలిసారి అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
Xi Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) చాలా ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు (US Visit) వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (APEC) శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే.
Xi Jinping | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) చాలా ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు (US Visit) వెళ్లారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార మండలి (APEC) శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సదస్సుకు యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ (Joe Biden) ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ అగ్రరాజ్యం వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో అడుగుపెట్టారు. జిన్‌పింగ్ సుమారు ఆరేళ్ల తర్వాత అమెరికా పర్యటకు వెళ్లడం ఇదే మొదటి సారి. చివరిసారిగా ఆయన 2017లో అగ్రరాజ్యంలో పర్యటించారు.
కాగా, జిన్‌పింగ్ ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం బైడెన్‌తో జిన్‌పింగ్ ధ్వైపాక్షిక భేటీలో పాల్గొననున్నారు. ఆ తర్వాత అపెక్ సదస్సుకు హాజరవుతారు. కాగా, ఇద్దరు దేశాధినేతల భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, తైవాన్ అంశాలు చర్చకు రానున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ పోరు నేపథ్యంలో బైడెన్, జిన్‌పింగ్ భేటీ కానుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. అయితే వీరి భేటీలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం అంశం చర్చకు వస్తుందా..? లేదా..? అనే విషయంలో వైట్‌హౌస్ స్పష్టత ఇవ్వలేదు. కాగా, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నది.
మరోవైపు డ్రాగన్ దేశం చైనా పాలస్తీనీయులకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్‌కు తమ దేశాన్ని రక్షించుకునే హక్కు ఉందని, అయితే అది అంతర్జాతీయ మానవతా చట్టాల పరిధికి లోబడి మాత్రమే ఉండాలని చైనా సూచించింది. అంతేగాక పాలస్తీనాను స్వతంత్ర దేశంగా మార్చడమే ఈ యుద్ధానికి ఏకైక పరిష్కారమని ఇటీవల డ్రాగన్ పునరుద్ఘాటించింది. కాగా, శాన్ఫ్రాన్సిస్కోలో జరిగే అపెక్ సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోదీని కూడా బైడెన్ ఆహ్వానించారు.
Also Read..
కెనడాలో దీపావళి వేడుకలపై ఖలిస్థానీ ఉగ్రవాదుల దాడి
IGLA-S | భారత్‌కు ఇగ్లా-ఎస్ యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్‌ను సరఫరా చేయనున్న రష్యా..!
NISAR | భారత అంతరిక్ష భవిష్యత్ ప్రణాళికలు ఆకర్షిస్తున్నాయి : నాసా జేపీఎల్ డైరెక్టర్ లెషిన్..
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- APEC
- china
- Joe Biden
- Xi Jinping
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

