Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌పై అనుచిత కామెంట్.. క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్
Abdul Razzaq: ఐశ్వర్యరాయ్‌కు క్షమాపణులు చెప్పాడు అబ్దుల్ రజాక్. ఓ షోలో ఐశ్వర్యపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు రజాక్ వైఖరిని ఖండించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటికి అతను క్షమాపణలు చెప్పాడు.
ఇస్లామాబాద్: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(Abdul Razzaq) ఇవాళ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అనవసరమైన రీతిలో ఐశ్వర్యరాయ్‌పై వ్యాఖ్యలు చేశాడు. దానిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. పాక్ క్రికెట్ పర్ఫార్మెన్స్, కోచింగ్ వ్యూహాల గురించి మాట్లాడుతూ.. గత తప్పిన రజాక్ తన మాటల్లో ఐశ్వర్యను ప్రస్తావించాడు. అయితే సమా టీవీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన రజాక్.. పాక్ క్రికెట్ కోచింగ్ గురించి వివరిస్తూ నోరు జారినట్లు అంగీకరించాడు. నోరు జారి ఐశ్వర్య పేరును ఎత్తినట్లు చెప్పాడు. ఐశ్వర్య రాయ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెబుతున్నట్లు వెల్లడించారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదన్నాడు.
గత కొన్ని రోజులుగా పీసీబీ ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదని, నేను ఆడే రోజుల్లో కెప్టెన్‌గా యూనిస్‌ఖాన్ జట్టును అద్భుతంగా నడిపించేవాడని, యూనిస్‌తో పాటు సహచరుల నుంచి నేను స్ఫూర్తి పొందేవాడిని, కానీ ప్రస్తుతం జట్టులో అలాంటి పరిస్థితి లేదని రజాక్ అన్నాడు. అంతటితో ఆగకుండా పీసీబీని విమర్శిస్తూ మీరు ఐశ్వర్యరాయ్‌ను పెండ్లి చేసుకుంటే మంచి పిల్లలు పుడుతారు అనుకుంటారు. కానీ ఎప్పటికీ అలా జరుగదు అని అన్నాడు. రజాక్ తీరును అందరూ తీవ్రంగా ఎండగడుతున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా రజాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రజాక్ మాట్లాడిన సమయంలో ఆ షోలో పక్కనే షాహిద్ అఫ్రిది కూడా ఉన్నారు. దీంతో ఆ ఇద్దరిపై విమర్శలు వచ్చాయి.
మాజీ ఫాస్ట్ బౌలర్ షోయెబ్ అక్తర్.. రజాక్ చేసిన కామెంట్‌ను వెంటనే ఖండించారు. మహిళలను కించపరచడం సరికాదు అని తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపాడు. షాహిద్ అఫ్రిది కూడా రజాక్ చేసిన కామెంట్‌ను తప్పుపట్టాడు. క్షమాపణలు చెప్పాలని రజాక్‌ను కోరినట్లు అఫ్రిది వెల్లడించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

