Anasuya Bharadwaj | మూడేళ్ల క్రితం ఓ టీవీ షో స్కిట్లో భాగంగా నువ్వు రాశీగారి ఫలాల గురించి మాట్లాడుతున్నావా..? అని అనసూయ భరద్వాజ్ అడిగితే.. అవి రాశీగారి ఫలాలు కాదు రాశిఫలాలు చెబుతున్నాడు హైపర్ ఆది. అయితే ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి రాశి ఈ కామెంట్స్‌ను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైన వీడియో తాజాగా తెరపైకి వచ్చింది.
ఓ మహిళగా అలా ఎలా అడుగుతుంది. రాశీ ఫలాల్లో నేను లేను. రాశీ ఫలాల గురించి గారులో నేనున్నా. ఆమె నా గురించి మాట్లాడింది. జడ్జిలలో ఒక ఆవిడ ఉన్నారు.. హ.. హ.. కానీ నేను నవ్వను. నేను ఆ ప్లేస్‌లో ఉండి ఉంటే ఎందుకంటే అది అనవసరం కదా.. అంటూ రాశీ చెప్పుకొచ్చిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. తాజాగా ఈ కామెంట్స్‌పై రియాక్ట్ అయింది అనసూయ. ఎక్స్ ద్వారా క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసింది.
మూడు సంవత్సరాల క్రితం నేను చేసిన ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించా. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తులను నేను ఆరోజే నిలదీసి అడిగి ఉండాల్సింది కానీ అప్పటికీ నాకున్నటువంటి శక్తి అందుకు సహకరించలేదు. అది పొరపాటే..నేను ఇప్పుడు వెనక్కి వెళ్లి ఆ తప్పును సరిదిద్దలేను. దయచేసి నన్ను క్షమించండి. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ను ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఆ కార్యక్రమం దర్శకనిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పును అంగీకరిస్తూ క్షమాపణ చెబుతున్నానని ఎక్స్‌లో సందేశాన్ని పోస్ట్ చేసింది అనసూయ.
అందం చీరకట్టులో, ఒళ్లు కనిపించకుండా వేసుకునే బట్టల్లోనే ఉంటుంది. అలా కాకుండా అభ్యంతరకరంగా (సామాన్లు కనిపించేలా) బట్టలు వేసుకుంటే అందులో విలువేముంటుంది? అంటూ దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్‌పై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తీవ్రంగా స్పందించడంతో మొదట ఆమెకు చాలా మంది మద్దతుగా నిలిచారు. అయితే ఈ క్రమంలో ఇప్పటికే శివాజీ క్షమాపణలు కూడా తెలియజేస్తూ..తన స్పీచ్‌పై పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశాడు శివాజీ. ఆ తర్వాత చాలా మంది శివాజీకి మద్దతుగా నిలుస్తూ.. అనసూయపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో రాశి కామెంట్స్ వీడియో బయటకు రావడం.. అనసూయ క్షమాపణలు చెప్పడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఎమ్మెల్యేగా చేసావు, మంత్రిగా చేసావు మాట్లాడితే మహిళా కార్డు వాడతావు
అలా ఒకరిపై నీచపు కామెడీ చేస్తుంటే కూర్చుని వెకిలి నవ్వు ఎలా నవ్వుతున్నావు @RojaSelvamaniRK pic.twitter.com/8pZvv4KhBh
— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) January 4, 2026
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 5, 2026