న్యూయార్క్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Nicolas Maduro)ను అమెరికా నిర్బంధించిన విషయం తెలిసిందే. అయితే మదురోపై నార్కోటెర్రరిజం అభియోగాలు నమోదు చేశారు. కొకైన్ మాదకద్రవ్యాలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ప్రభుత్వ ఆధీనంలో నడిపట్లు ఆరోపణలు ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ ట్రాఫికింగ్ గ్రూపులతో జతకట్టిన మదురో ఆ నెట్‌వర్క్‌ను కొనసాగించినట్లు అమెరికా తన రిపోర్టులో పేర్కొన్నది. మెక్సికోలోని సినలోవా, జీటాస్ కార్టల్స్తోనూ మదురో టీమ్ ఓ గ్యాంగ్‌గా ఏర్పడినట్లు అనుమానిస్తున్నారు. కొలంబియా పారామిలిటరీ గ్రూపు ఎఫ్ఏఆర్సీ, వెనిజులా గ్యాంగ్ ట్రెన్ డీ ఆర్వాతోనూ డ్రగ్ ట్రాఫికింగ్ కార్యకలాపాలను నడిపించారు. అధికార పార్టీ ఆగడాలు కొనసాగేందుకు కొకైన్ అవినీతిని ఎంకరేజ్ చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. కొకైన్ మాదకద్రవ్యంతో పాటు మెషీన్ గన్నులు, విధ్వంసకర డివైస్‌లు కలిగి ఉన్న కేసు కూడా మదురోపై నమోదు చేశారు. మదురో ఒకవేళ దోషిగా తేలితే ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం ఉన్నది.
వెనిజులా జాతీయ అసెంబ్లీలోకి 2000 సంవత్సరంలో మదురో ఎన్నికయ్యారు. అయితే అప్పటి నుంచే ఆయన డ్రగ్ ట్రాఫికింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2006 నుంచి 2013 వరకు ఆయన విదేశాంగ మంత్రిగా ఉన్నారు. హ్యూగో చావేజ్ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మదరో కొకైన్ నేరాలకు పాల్పడినట్లు తెలుస్తున్నది. విదేశాంగ మంత్రి హోదాలో డ్రగ్ ట్రాఫికర్లకు డిప్లమోటిక్ పాస్‌పోర్టులను ఆయన జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మెక్సికో నుంచి వెనిజులాకు వస్తున్న డ్రగ్ రవాణాకు భద్రతను ఏర్పాటు చేసేవారు. వెనిజులా అధికారులు సీజ్ చేసిన కొకైన్‌ను ప్రభుత్వ స్పాన్సర్ క్రిమినల్ గ్యాంగ్‌లకు చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ ఆపరేషన్స్ గురించి తెలియకుండా ఉండేందుకు కిడ్నాప్‌లు, మర్డర్లు, బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. వసూళ్లు సేకరించేందుకు కూడా మదురో నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొకైన్ ట్రాఫికింగ్ రూట్లను మదరోనే డైరెక్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. షిప్మెంట్లను కాపాడుకునేందుకు వాటికి మిలిటరీ రక్షణ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తోంది. విధ్వంసకర ట్రాఫికింగ్ గ్రూపులకు షెలర్ట్ ఏర్పాటు చేశారు. డ్రగ్స్‌ను మరో చోటకి తరలించేందుకు అధ్యక్ష అధికారాలను వాడుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో మదురో విజయం సాధించిన తర్వాత .. అమెరికా ఆయన్ను నియంతగా ప్రకటించింది. డ్రగ్ ట్రాఫికింగ్ దందా నడిపిస్తున్న వెనిజులా రాజకీయ, సైనిక అధికారులకు మదురో కింగ్‌పిన్‌గా వ్యవహరించినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. అమెరికా ఉగ్ర సంస్థలతో చేతులు కలిపి వేల వేల టన్నుల కొకైన్‌ను అమెరికాకు తరలించినట్లు మదురోపై ఆరోపణలు ఉన్నాయి. 2020లో తొలిసారి మదురోపై నార్కో ట్రాఫింగ్ కేసు నమోదు అయ్యింది.
మదరో, ఆయన భార్యను ఇవాళ న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టుకు తరలించారు.