Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) శతకాలమోత కొనసాగుతోంది. అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో రికార్డు సెంచరీలు బాదిన ఈ స్టార్ క్రికెటర్.. యాషెస్ సిరీస్ (Ashes Sereis)లో రెండో సెంచరీతో చరిత్ర సృష్టించాడు. సిడ్నీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగులతో రెచ్చిపోయిన రూట్ అత్యధిక శతకాలు బాదిన మూడో ఆటగాడిగా అవతరించాడు. తద్వారా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ (Ricky Ponting) సరసన నిలిచాడీ రన్ మెషీన్. అంతేకాదు ఐదేళ్లలో 24 సెంచరీలతో ఎవరికీ సాధ్యమవ్వని ఘనతం సొంతం చేసుకున్నాడు.
టెస్టుల్లో అత్యుత్తమ ఆటగాడైన జో రూట్ నిలకడగా రాణిస్తూ రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. నిరుడు భారత్‌పై రెండు శతకాలతో కుమార సంగక్కర, రాహుల్ ద్రవిడ్‌లను అధిగమించిన ఇంగ్లండ్ ఆటగాడు ఐదేళ్లలో ఏకంగా 24 సార్లు మూడంకెల స్కోర్ అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్(భారత్), కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్), స్టీవ్ స్మిత్(ఆస్ట్రేలియా) హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్)లు పదేసి శతకాలతో రెండో స్థానంలో ఉన్నారు.
Joe Root is now less than 2000 runs away from Sachin Tendulkar’s record of 15,921 Test runs 👀 pic.twitter.com/5JNlcmdf4b
— ESPNcricinfo (@ESPNcricinfo) January 5, 2026
సిడ్నీలో 160 రన్స్ చేసిన రూట్ 150కి పైగా స్కోర్ చేయడం ఇది17వ సారి. 20 సార్లు ఈ మార్క్ చేరుకున్న సచిన్ అతడి కంటే ముందున్నాడు. ఇదే ఊపులో ఈ రన్ మెషీన్ మరో 2 వేల పరుగులు చేస్తే మాస్టర్ బ్లాస్టర్ (15,921) రికార్డును సమం చేస్తాడు.
A true great of the game 🏏
Joe Root moves level with ICC Hall of Famer Ricky Ponting 📝
More 📲 https://t.co/AEFYMgudtk pic.twitter.com/JfN6kVGxrx
— ICC (@ICC) January 5, 2026
టెస్టుల్లో నయా కింగ్‌గా పేరొందిన రూట్ 41 సెంచరీలతో పాంటింగ్ రికార్డు సమం చేశాడు. రెడ్ బాల్ క్రికెట్లో సెంచరీల వీరుడిగా భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. క్రికెట్ గాడ్‌గా పేరొందిన సచిన్ 51 సెంచరీలు సాధించగా.. దక్షిణాఫ్రికా వెటరన్ జాక్వెస్ కలిస్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర 38 సెంచరీలు కొట్టాడు. ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్న రూట్ ఇదే తీరుగా మరో రెండు – మూడేళ్లు ఆడితే కలిస్ రికార్డును బ్రేక్ చేసి.. సచిన్‌కు చేరువయ్యే అవకాశముంది.
Most Test centuries in this decade 💯📋
No one is coming near Joe Root 😱#AUSvENG pic.twitter.com/dStVHe5j7N
— Sport360° (@Sport360) January 5, 2026