Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసు.. బీహార్ యువకుడిని ప్రశ్నించిన ఢిల్లీ పోలీసులు
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు (Delhi Cops) విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని (Bihar Teen) పోలీసులు తాజాగా ప్రశ్నించారు.
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video) ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు (Delhi Cops) విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని (Bihar Teen) పోలీసులు తాజాగా ప్రశ్నించారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తెలిపారు.
సదరు యువకుడు ముందుగా ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేసి ఆ తర్వాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా అతని ఖాతా నుంచే ఈ వీడియో అప్లోడ్ అయినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు సదరు యువకుడికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు విచారణ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోను మొదట డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు వెల్లడించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
రష్మిక మందన్నా సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్ మొదలుకుని, విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్ ఇలా టాలీవుడ్ ప్రముఖులు అందరూ రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
కేంద్ర ఐటీ శాఖ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) చర్యలకు ఉపక్రమించారు. మార్ఫింగ్ వీడియోపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ వీడియో ఏ అకౌంట్ నుంచి తొలుత అప్లోడ్ అయ్యిందో అందుకు సంబంధించిన యూఆర్ఎల్ వివరాలను అందించాలంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా (Meta)ను కోరారు. అదేవిధంగా నకిలీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారి వివరాలను కూడా అందించాలని కోరుతూ మెటా సంస్థకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు తెలిపాయి.
Also Read..
Namitha | చీటింగ్ కేసులో నటి నమిత భర్తకు సమన్లు
Chiranjeevi | చరణ్ దివాళీ పార్టీలో చిరంజీవి క్రేజీ డ్యాన్స్.. వీడియో వైరల్
Chath Pooja | ఛఠ్ పూజ వేళ రైలు రద్దుతో ఆగ్రహించిన ప్రయాణికులు.. మరో ట్రైన్‌పై రాళ్లు రువ్వి నిరసన
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పలువురికి బానోత్ మనీషా లక్ష్మి పరామర్శ
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
BRS | మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన యువత
నల్లగొండ వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి బదిలీ
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

