బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 50 ఓవర్లలో 225/9 స్కోరు చేసింది. ఛేదనను భారత్ 30.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. అభిగ్యాన్ (87*), త్రివేది (61) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (38) వేగంగా ఆడాడు.