బ్రిస్బేన్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్ -19 జట్టు సత్తాచాటింది. ఆతిథ్య జట్టును వారి సొంత ఇలాఖాలో చిత్తుచేసి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లోనూ 167 రన్స్‌తో నెగ్గింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. 50 ఓవర్లలో 280/9 స్కోరు చేసింది. వేదాంత్ త్రివేది (86), రాహుల్ కుమార్ (62), విహాన్ (40) రాణించారు. ఛేదనలో ఆస్ట్రేలియా 113 పరుగులకే కుప్పకూలింది. ఖిలాన్ పటేల్ (4/26), ఉద్ధవ్ మోహన్ (3/26) ఆతిథ్య జట్టును కట్టడిచేశారు.