Operation Sindoor | పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా బదులిచ్చింది. ఉగ్రదాడి జరిగిన 15 రోజుల తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విరుచుకుపడింది. పాక్ ఆర్మీ, పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. భారత్ ప్రతీకార చర్యకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది.
‘ఆపరేషన్ సిందూర్’పై సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు క్రికెటర్లు సైతం భారత్ చర్యను సమర్థించారు. భారత క్రికెట్ దిగ్గజాలు, ప్రస్తుత ఆటగాళ్లు సైన్యానికి మద్దతుగా నిలిచి ‘జై హింద్’ (Jai Hind), ‘ధర్మో రక్షతి రక్షితః..’, ‘భారత మాతాకీ జై’ అంటూ దేశభక్తిని చాటుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆకాశ్ చోప్రా, సురేశ్ రైనా సహా పలువురు ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా భారత సైన్యానికి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
Also Read..
Operation Sindoor | 25 నిమిషాలు.. తొమ్మిది టార్గెట్లు.. ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు
Uri 2016 To Pahalgam 2025 | యురి టు పెహల్గామ్.. దాయాది దేశంపై భారత మెరుపుదాడులు ఇవే..