Amit Shah |పెహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ధీటుగా స్పందించింది. ఈ మేరకు పాక్‌పై ప్రతీకార చర్యకు దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో దాయాదిదేశంపై మెరుపు దాడులు చేసింది. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి.
జైషే మహమ్మద్, మురిద్కే లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్లిన సిబ్బందిని (Leaves cancelled) వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ చీఫ్‌లకు (paramilitary chiefs) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి. షా ఆదేశాలతో పాక్‌పై మరిన్ని దాడులు జరిగే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లోగల మినీస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రమూక కాల్పులకు తెగబడింది. మతం అడిగి మరీ 26 మంది పురుషులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. దీంతో దాడి అనంతరం నుంచి పాక్‌ను భారత్ అన్ని వైపులా దిగ్బంధిస్తూ వచ్చింది. దాడి తర్వాత 15 రోజులకు ప్రతీకార దాడి చేసి ఉగ్రవాదులకు సరైన గుణపాఠం చెప్పింది.
Also Read..
Uri 2016 To Pahalgam 2025 | యురి టు పెహల్గామ్.. దాయాది దేశంపై భారత మెరుపుదాడులు ఇవే..
Operation Sindoor | 25 నిమిషాలు.. తొమ్మిది టార్గెట్లు.. ఉగ్రస్థావరాలపై భారత్ దాడులు
Operation Sindoor: మిస్సైల్ దాడి.. భారీగా పేలుడు.. బైక్‌పై జనం పరుగులు.. ఆపరేషన్ సిందూర్ వీడియో