WTC Points Table | గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరిగి రెండో టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిపాలైంది. సొంతగడ్డపై భారత్ 0-2 తేడాతో వైట్‌వాష్‌కు గురైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో స్థానం దిగజారింది. దాయాది దేశం పాకిస్తాన్ జట్టు తర్వాత ఐదోస్థానానికి పడిపోయింది. స్వదేశంలో భారత్‌కు దారుణమైన ఓటమిని చవిచూసింది. గౌహతి టెస్ట్‌ను దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో గెలిచింది. రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను వైట్‌వాష్ చేసింది. కోల్‌కతా టెస్ట్‌ను దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో గెలిచిన బావుమా నేతృత్వంలోని ప్రొటీస్ జట్టు.. గౌహతి టెస్టులో భారత్‌కు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ను 140 పరుగులకు ఆలౌట్ చేసి 408 పరుగుల తేడాతో సిరీస్‌ను గెలిచింది.
ఇది టెస్ట్ క్రికెట్లో, స్వదేశంలో పరుగుల పరంగా భారత్‌కు అతిపెద్ద ఓటమి. గతంలో 2004లో నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 342 పరుగుల తేడాతో ఓడిపోయింది. 13 నెలల్లో ఒక జట్టు స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేయడం ఇది రెండోసారి. గతేడాది అక్టోబర్-నవంబర్-2024 మధ్య జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను న్యూజిలాండ్ వైట్‌వాష్ చేసింది. న్యూజిలాండ్ మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను 3-0 తేడాతో ఓడించింది. తాజాగా ప్రొటీస్ జట్టు చేతిలో ఓటమి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దారుణంగా ఐదోస్థానానికి చేరుకుంది. భారత జట్టు ప్రపంచ టెస్ట్ చాంపియన్ ఫైనల్ ఆశలను దెబ్బతీసింది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా రెండోస్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రస్తుత వరల్డ్ చాంపియన్‌షిప్ టెస్ట్ సైకిల్లో దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది.
ఇందులో మూడు గెలిచి ఓ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా ప్రస్తుతం 36 పాయింట్లతో 75 శాతం శాతంతో రెండోస్థానంలో ఉంది. మరో వైపు భారత జట్టు స్థానం దిగజారింది. ప్రస్తుతం భారత్ కంటే పాకిస్తాన్ మెరుగ్గా నాలుగో స్థానంలో ఉంది. భారత్ తొమ్మిది టెస్ట్ మ్యాచుల్లో నాలుగు ఓడిపోయింది. నాలుగు టెస్టుల్లో గెలువగా.. ఓ టెస్ట్ డ్రాగా ముగిసింది. 52 పాయింట్లు, 48.15 శాతంతో ఐదవ స్థానంలో కొనసాగుతున్నది. రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయం, ఒక ఓటమితో పాకిస్తాన్ 12 పాయింట్లు, 50 శాతం శాతంతో నాలుగో స్థానానికి చేరుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా నాలుగు మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌లను గెలిచింది. ఆస్ట్రేలియా 48 పాయింట్లు ఉండగా.. 100శాతం పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక శ్రీలంక పాయింట్ల పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతున్నది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
Read Also :
ICC Rankings | మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ..!