ICC Rankings | మళ్లీ వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ..!
ICC Rankings | ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాడిల్ మిచెల్‌ను అధిగమించి నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచుల్లో రేటింగ్ పాయింట్లు తగ్గడంతో రాడిల్ ర్యాంకు దిగజారింది.
ICC Rankings | ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి నెంబర్ స్థానానికి చేరుకున్నాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ రాడిల్ మిచెల్‌ను అధిగమించి నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. గత రెండు మ్యాచుల్లో రేటింగ్ పాయింట్లు తగ్గడంతో రాడిల్ ర్యాంకు దిగజారింది. త్వరలోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న క్రమంలోనే రోహిత్ అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. రోహిత్ నంబర్ వన్ స్థానాకి చేరుకోవడంతో టీమిండియా అభిమానులు జట్టుకు శుభ సంకేతంగా భావిస్తున్నారు. ఇక ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 4వ స్థానంలో, విరాట్ కోహ్లీ 5వ స్థానంలో, శ్రేయాస్ అయ్యర్ ఒక ర్యాంకు దిగజారి 9వ స్థానానికి చేరుకున్నాడు.
మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోయినప్పటికీ న్యూజిలాండ్ ఇతర ప్లేయర్స్ రాణించారు. రచిన్ రవీంద్ర ఒక స్థానం ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నారు. డెవాన్ కాన్వే 11 స్థానాలు ఎగబాకి 31వ స్థానానికి చేరాడు. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ తన అజేయ సెంచరీతో ర్యాంకింగ్స్‌లో ఎగబాకి 8వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలర్లలో మిచెల్ శాంట్నర్, మాట్ హెన్రీల అద్భుత ప్రదర్శన చేయడంతో ర్యాంకులు పెరిగాయి. శాంట్నర్ 6వ స్థానం, హెన్ని 10వ స్థానంలో నిలిచాడు. జింబాబ్వే స్టార్ ఆటగాడు సికందర్ రజా తొలిసారిగా టీ20 అంతర్జాతీయ ఆల్ రౌండర్ ర్యాంకింగ్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకొని చరిత్ర సృష్టించాడు. ట్రై-సిరీస్‌లో అతని ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. టెస్టుల్లో బౌలర్స్, ఆల్‌రౌండర్ల ర్యాంకుల్లో ర్యాంకులు మారాయి.
ఇంగ్లండ్‌కు చెందిన ఓలీ పోప్ ఇప్పుడు 24వ స్థానానికి చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌కు చెందిన తైజుల్ ఇస్లాం 15వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ టెస్ట్ బౌలర్లలో 5వ స్థానానికి ఎగబాకాడు. ఆల్ రౌండర్ల జాబితాలో బెన్ స్టోక్స్ రెండవ స్థానానికి చేరగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో చెందిన రవీంద్ర జడేజా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. రాబోయే టీ20 ప్రపంచ కప్-2026కి ఐసీసీ అతన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ టోర్నమెంట్ భారత్-శ్రీలంక వేదికగా జరుగనున్నది. రోహిత్ ఇప్పటివరకు తొమ్మిది టీ20 ప్రపంచ కప్‌లలో ఆడాడు. ఇందులో 2024లో టీమిండియా టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. 47 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో 1,220 పరుగులు చేసిన రోహిత్ ఈ కొత్త పాత్ర పోషించనున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sruthi Hassan | ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ వివాదంపై శ్రుతి హాసన్ కామెంట్స్.. జాన్వీ కపూర్ విషయంలో మాత్రం సైలెంట్!
ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేపై వరుస ప్రమాదాలు.. తాజాగా దంపతులు మృతి
Vijay Antony | హైదరాబాద్ వీధుల్లో బజ్జీలు వేసిన హీరో విజయ్ ఆంటోనీ.. ఇరానీ చాయ్ తాగుతూ సందడి..!
Nepal Earthquake | నేపాల్‌లో 5.3 తీవ్రతతో భూకంపం.. భారత్ సహా పలు దేశాల్లో ప్రకంపనలు
Phone To Kids | చిన్నారులు భావోద్వేగాలకు గురైనప్పుడు వెంటనే ఫోన్ ఇస్తున్నారా.. ఇకపై అలా చేయకండి.. ఎందుకంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

