IND Vs SA | స్వదేశంలో భారత జట్టు మరోసారి ఘోర పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో ఓడించింది. కోల్‌కతా టెస్టును 30 పరుగుల తేడాతో.. తాజాగా గౌహతి టెస్ట్‌ను 408 పరుగుల తేడాతో గెలిచింది. ఇదే టెస్టుల్లో భారత్‌కు అతిపెద్ద ఓటమి. ఒకప్పుడు స్వదేశంలో టెస్టుల్లో విజృంభించిన భారత జట్టు ప్రస్తుతం.. పసికూనల స్థాయికి చేరింది. ఈ క్రమంలో ప్రపంచ టెస్ట్ చాంపియన్ దక్షిణాఫ్రికా సరికొత్త చరిత్ర సృష్టించింది. 25 సంవత్సరాల తర్వాత భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలిచింది. దక్షిణాఫ్రికా చివరిసారిగా 2000 సంవల్సరంలో భారతదేశంలో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్లీప్ చేసింది.
2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను వైట్‌వాష్ చేసింది. స్వదేశంలో భారత్‌పై దక్షిణాఫ్రికా రెండు టెస్ట్ సిరీస్‌లను గెలిచింది. రెండు టెస్టుల్లోనూ భారత్‌ను వైట్‌వాష్ చేసింది. ప్రోటీస్ జట్టు తన స్వదేశంలో రెండుసార్లు టెస్ట్ సిరీస్‌లో భారత్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టునుగా నిలిచింది. భారత్ స్వదేశంలో మూడుసార్లు క్లీన్ స్వీప్‌కు గురైంది. దక్షిణాఫ్రికా కంటే ముందు న్యూజిలాండ్ సైతం వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ క్రికెట్ 1992-93లో ప్రారంభమైంది. అప్పటి నుంచి రెండు జట్ల మధ్య మొత్తం 17 ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లు జరిగాయి. ఈ సిరీస్‌లలో భారత్ కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. దక్షిణాఫ్రికా తొమ్మిది సార్లు గెలిచింది. మిగిలిన నాలుగు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. టెస్ట్ క్రికెట్లో భారత్‌పై దక్షిణాఫ్రికా ఆధిపత్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇబ్బందులుపడింది. కానీ ఈ సిరీస్‌కు ముందు టీమిండియా ఇండియా స్వదేశంలో ప్రోటీస్‌పై అద్భుతంగా ప్రదర్శన ఇచ్చింది. దక్షిణాఫ్రికాతో సొంత మైదానంలో జరిగిన నాలుగు సిరీస్‌లను భారత్ గెలిచింది.
తాజాగా స్వదేశంలో సైతం భారతదేశ ఆధిపత్యం ముగిసేలా కనిపిస్తోంది. భారత జట్టు తమ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో మొత్తం ఎనిమిది టెస్ట్ సిరీస్‌లు ఆడింది. ఇందులో నాలుగు గెలిచింది. ఈ సిరీస్‌లతో సహా దక్షిణాఫ్రికా రెండు సిరీస్‌లను గెలుచుకుంది. రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. కాగా, దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ తొమ్మిది టెస్ట్ సిరీస్‌లు ఆడింది. దక్షిణాఫ్రికా జట్టు ఏడు సిరీస్‌లను గెలుచుకోగా, రెండు సిరీస్‌లు డ్రా అయ్యాయి. 1996, 2004, 2015, 2019లో దక్షిణాఫ్రికాపై భారత్ టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. చివరిసారిగా దక్షిణాఫ్రికాను టెస్ట్ సిరీస్‌లో ఓడించింది. ఆరు సంవత్సరాల కిందట ఓడించింది. మరోవైపు, భారత్‌లో దక్షిణాఫ్రికా రెండుసార్లు మాత్రమే విజయం సాధించింది. 2000, 2025 సంవత్సరాల్లో భారత్‌ను వైట్‌వాష్ చేసి.. సిరీస్‌లను నెగ్గింది.