Asian Champions Trophy | అటాకింగ్ గేమ్ అదుర్స్.. భారత్‌కు రెండో విజయం
Asian Champions Trophy : ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు(Inida Hockey Team) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) తొలి మ్యాచ్‌లో చైనాను మట్టికరిపించిన బోణీ కొట్టి రోజైనా గడువలేదు.. 'మెన్ ఇన్ బ్లూ' జట్టు మరో విజయాన్ని రుచి చూసింది.
Asian Champions Trophy : ఒలింపిక్స్‌లో వరుసగా రెండో కాంస్యంతో చరిత్ర సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు(Inida Hockey Team) జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ(Asian Champions Trophy) తొలి మ్యాచ్‌లో చైనాను మట్టికరిపించిన బోణీ కొట్టి రోజైనా గడువలేదు.. ‘మెన్ ఇన్ బ్లూ’ జట్టు మరో విజయాన్ని రుచి చూసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో జపాన్(Japan)పై టీమిండియా ఘన విజయం సాధించింది.
విశ్వ క్రీడల్లో పతక విజేతగా ఆడుతున్న తొలి టోర్నీలో టీమిండియా పంజా విసురుతోంది. వరుస పెట్టి ప్రత్యర్థులను ఓడిస్తూ వస్తోంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ ఆరంభ పోరులో 3-0తో చైనాకు చెక్ పెట్టింది. ఇక జపాన్‌పై కూడా హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreeth Singh) బృందం అదే జోరు కనబరిచింది. అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల ఎత్తులను చిత్తు చేసి.. 5-1తో జయభేరి మోగించింది.
Team India gets a second 𝕎 under the belt with a smashing win against Japan.
5 goals scored in the game, a brace from Sukhjeet and a goal each from Abhishek, Sanjay & Uttam Singh.
We face Malaysia next on 11th at 1:15 PM (IST)
Do not forget to tune in to support team India… pic.twitter.com/jNJGv7GDfM
— Hockey India (@TheHockeyIndia) September 9, 2024
తొలి అర్ధ భాగంలోనే జపాన్ గోల్‌పోస్ట్‌పై భారత ఆటగాళ్లు దాడిచేసి సఫలం అయ్యారు. ఆఖరి అర్ధ భాగంలో జపాన్ ఎట్టకేలకు ఒక్క గోల్ చేయగలిగింది. అప్పటికే సంపూర్ణ అధిపత్యం కలిగిన భారత్ వరసగా రెండో విజయం నమోదు చేసింది. భారత్ తరఫున సుఖ్జీత్ రెండు, అభిషేక్(మూడో గోల్), సంజయ్(17వ నిమిషం), ఉత్తమ్ సింగ్(54వ నిమిషం)లు తలా ఒక గోల్ సాధించారు. సెప్టెంబర్ 11న జరిగే తదుపరి మ్యాచ్‌లో మలేషియాతో భారత జట్టు తలపడనుంది.
ఇవి కూడా చదవండి
- AAP | కాంగ్రెస్‌తో తేలని పొత్తు.. హర్యానా ఎన్నికలకు తొలి జాబితా విడుదల చేసిన ఆప్
- Sachin Tendulkar | ఇంట్లోనే గణపయ్య నిమజ్జనం.. సచిన్ భావోద్వేగ పోస్ట్
- Karnataka | సిద్ధరామయ్య సీటుకు ఎసరు : బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

