AAP | హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party), కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య స్పష్టత రాలేదు. ఈ క్రమంలో పొత్తుపై ఆప్ కీలక ప్రకటన చేస్తూ సోమవారం సాయంత్రంలోగా కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాకుంటే మొత్తం 90 స్ధానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా తొలి జాబితా విడుదల చేసింది. 20 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది.
Aam Aadmi Party (AAP) releases first list of 20 candidates for Haryana Assembly Elections pic.twitter.com/CBkbRtjW2z
— ANI (@ANI) September 9, 2024
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే నెలలో జరగబోయే హర్యానా ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేయాలని ఢిల్లీ పార్టీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ ఏడింటిని మాత్రమే వదులుకోవడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఇప్పటివరకూ పొత్తు చర్చలు ఓ కొలిక్కి రాలేదు. కాంగ్రెస్‌తో పొత్తుపై చర్చలు జరుగుతున్న వేళ ఆప్ తొలి జాబితా విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌తో పొత్తుకు సంబంధించి పార్టీ నాయకత్వం నుంచి తమకు ఇప్పటివరకూ ఎలాంటి సందేశం లేదని హర్యానా ఆప్ చీఫ్ సుశీల్ గుప్తా వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి మొత్తం 90 అసెంబ్లీ స్ధానాల అభ్యర్ధులను ప్రకటించేందుకు ఆప్ హరియాణ శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై కసరత్తు కొలిక్కివచ్చిందని, పార్టీ కేంద్ర నాయకత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన అనంతరం అభ్యర్ధుల జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఆప్ సన్నాహాలతో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలో చర్చల్లో ఎలాంటి పురోగతి లేదనే సంకేతాలు వెల్లడవుతున్నాయి.
వచ్చే నెలలో హర్యానా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Muhammad Yunus | భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
Sachin Tendulkar | ఇంట్లోనే గణపయ్య నిమజ్జనం.. సచిన్ భావోద్వేగ పోస్ట్