సిద్దిపేట, జనవరి7: పామాయిల్‌కు సిద్దిపేట జిల్లా బ్రాండ్ కాబోతున్నదని, స్థానిక నర్మెటలో ఆయి ల్ పామ్ ఫ్యాక్టరీ రిఫైనరీకి సిద్ధమైనట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మూడేండ్లుగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఆయిల్ ఫెడ్ అధికారులతో బుధవారం ఎమ్మెల్యే హరీశ్‌రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేటలోని నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్నామని, ప్రస్తుతం ప్రొడక్షన్ కోసం పూర్తి దశకు వచ్చిందన్నారు. ఇకడే వంట నూనె పామాయిల్‌ను రిఫైనరీ చేసి సిద్దిపేట బ్రాండ్ పేరుతో ప్యాకింగ్ అయ్యేలా ఏర్పాటుచేసుకుంటామన్నారు. ఇకడే మంచి నూనె తయారైతే, రైతు లు తమ పంటను ఇక్కడికే పంపే అవకాశం ఉంటుందన్నా రు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయిల్‌పై 50% సుంకం తగ్గించిందన్నారు. దీంతో రైతు లు కొంతమేరకు నష్టపోయే అవకాశం ఉం టుందన్నారు. పామాయి ల్ తోటల్లో ఎరువులు, నీటి యాజమాన్య పద్ధతులపై జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. మూడేండ్లు దాటిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి మొకకు యూరియా 650 గ్రాములు, సింగిల్ సూపర్ పాస్పేట్ కిలో, పొటాష్ 500 గ్రాములు తప్పకుండా వేయాలన్నారు. తర్వాత 10 రోజులకు ప్రతి మొక కు 250 గ్రాముల మెగ్నీషియంను ఏడాదికి రెండుసార్లు వేయాలని సూ చించారు. అంతర్ పంటగా కోకో వేసుకుని ఏడాదికి రూ.80వేల అదనపు ఆదాయం పొందవచ్చన్నారు.