Muhammad Yunus | భారత్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం
Muhammad Yunus | భారత్‌తో బంగ్లాదేశ్ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటోందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ తెలిపారు.
Muhammad Yunus | భారత్‌తో బంగ్లాదేశ్ సత్సంబంధాలు కొనసాగించాలని కోరుకుంటోందని ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ తెలిపారు. ఇటీవలే ఆ దేశంలో జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఇతర వర్గాలతో యూనస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ యూనస్ ఈ విధంగా స్పందించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎస్ వార్తా సంస్థ నివేదించింది.
‘మేం భారత్‌తో మంచి సంబంధాలను కొనసాగించాలని భావిస్తున్నాం. అయితే అవి కచ్చితంగా సమానత్వం, పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని యూనస్ నొక్కి చెప్పినట్లుగా ఆయన సహాయకుడు మహ్ఫుజ్ ఆలంని ఊటంకిస్తూ బీఎస్ఎస్ నివేదించింది. పొరుగు దేశాలతో సంబంధాలకు బంగ్లాదేశ్ పరస్పర గౌరవం ఇస్తుందన్నారు. సార్క్ (సౌత్ ఏషియన్ అసోసియేషన్ రీజనల్ కోపరేషన్)ను పునరుద్ధరించాలని యూనస్ నొక్కి చెప్పినట్లు ఆలం తెలిపారు.
మరోవైపు హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్‌లో తలదాచుకున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆ దేశానికి చెందిన ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్’ ఆదివారం ప్రకటించింది. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి సామూహిక హత్యాకాండకు పాల్పడ్డారని హసీనా సహా పలువురిపై తాత్కాలిక ప్రభుత్వం కేసుల్ని నమోదు చేసింది. వీటి విచారణ కోసం ఆమెను రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. ‘హసీనా సహా పరారీలో ఉన్న వారందరికీ అరెస్టు వారెంట్ జారీ చేయాలంటూ ట్రిబ్యునల్‌కు దరఖాస్తు చేయబోతున్నాం. ఇరు దేశాల మధ్య నిందితుల అప్పగింతపై ఒప్పందం ఉంది’ అని ట్రిబ్యునల్ చీఫ్ ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లామ్ చెప్పారు.
Also Read..
MLA Kamineni | ఎమ్మెల్యే కామినేనికి తృటిలో తప్పిన ప్రమాదం..
Sudan | సుడాన్ మార్కెట్‌పై బాంబు దాడి.. 21 మంది మృతి
Mpox | భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

