Sudan | సుడాన్ మార్కెట్‌పై బాంబు దాడి.. 21 మంది మృతి
Sudan | యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan)లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెన్నార్ (Sennar)లో పారామిలిటరీ దళాలు దాడికి పాల్పడ్డాయి.
Sudan | యుద్ధంతో ఛిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan)లో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెన్నార్ (Sennar)లో పారామిలిటరీ దళాలు దాడికి పాల్పడ్డాయి. ఓ మార్కెట్‌పై బాంబులతో (Market Shelling) విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో సుమారు 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. పదులు సంఖ్యలో గాయపడ్డారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. సెన్నార్‌లోని రద్దీగా ఉండే మార్కెట్లో ఆదివారం ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో 21 మంది మరణించారు. 70 మందికిపైగా గాయపడ్డారు. పారామిలిటరీ దళాలే ఈ దాడికి పాల్పడ్డారని సుడాన్ వైద్య వర్గాలు ఆరోపిస్తున్నాయి.
కాగా, ఆగస్టు నెలలో కూడా పారామిలిటరీ దళాలు ఓ గ్రామంపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. సెంట్రల్ సూడాన్‌లోని సిన్నార్ రాష్ట్రంలో (Sinnar state) పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) జరిపిన కాల్పుల్లో సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు పారామిలిటరీ బలగాలు యత్నించగా.. స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఆర్ఎస్ఎఫ్ కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా నివేదించింది.
‘సెంట్రల్ సూడాన్‌లో గల సిన్నార్ రాష్ట్రంలోని జల్కిని గ్రామంపై ఆర్ఎస్ఎఫ్ బలగాలు గురిపెట్టాయి. గురువారం నుంచి గ్రామాన్ని చుట్టుముట్టి రక్తపాతం సృష్టించారు. గ్రామం నుంచి ఓ బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. దీన్ని స్థానికులు ప్రతిఘటించారు. ఈ ఘటన మరణకాండకు దారితీసింది. ఆర్ఎస్ఎఫ్ బలగాలు జరిపిన కాల్పుల్లో 80 మంది మరణించారు. చాలా మంది ప్రజలు గాయపడ్డారు’ అని జిన్హువా వార్తా సంస్థ నివేదించింది.
సుడాన్ సైన్యం, మహ్మద్ హమ్దాన్ డాగ్లో నేతృత్వంలోని పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ (RSF) మధ్య ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. వీరి మధ్య గతేడాది ఏప్రిల్ 15న ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈ ఆధిపత్య పోరులో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఈ యుద్ధం కారణంగా 16,650 మంది ప్రాణాలు కోల్పోగా.. వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కోట్ల మంది ప్రజలు సూడాన్‌ను వదిలి వెళ్లిపోయారు. దాదాపు 2.2 మిలియన్ల మంది ప్రజలు పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read..
Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ‘నాటు నాటు’ పాట.. దేశీ టచ్‌తో దూసుకెళ్తున్న కమలా హారిస్
Mpox | భారత్‌లో మంకీపాక్స్ కలకలం.. అన్ని రాష్ట్రాలకూ అడ్వైజరీ జారీ చేసిన కేంద్రం
Union Minister | రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌ను తన జీవితకాలంలో అర్ధం చేసుకోలేరు : గిరిరాజ్ సింగ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

