Union Minister : బీజేపీ మాతృసంస్ధ ఆరెస్సెస్‌పై అమెరికాలోని టెక్సాస్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ, విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తోసిపుచ్చారు. ఢిల్లీలో సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆరెస్సెస్‌ను ఓ మోసకారి ఎన్నటికీ అర్ధం చేసుకోలేడని వ్యాఖ్యానించారు. ఆరెస్సెస్‌పై వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ చరిత్ర పేజీలు తిరగేయాలని, అత్యాధునిక టెక్నాలజీ ఏమైనా అందుబాటులో ఉంటే ఆరెస్సెస్ గురించి తన నాయనమ్మను అడిగి తెలుసుకోవాలని హితవు పలికారు.
ఆరెస్సెస్‌ను ఆయన వాస్తవంగా అర్ధం చేసుకోవాలంటే ఎన్నో జన్మలు పడుతుందని వ్యాఖ్యానించారు. దేశద్రోహి ఆరెస్సెస్‌ను అర్ధం చేసుకోలేరని, దేశాన్ని విమర్శించేందుకు విదేశాలకు వెళ్లేవారు దాని (ఆరెస్సెస్) సారాంశాన్ని అర్ధం చేసుకోలేరని వ్యాఖ్యానించారు. భారత్ ప్రతిష్టను దిగజార్చేందుకే రాహుల్ విదేశీ పర్యటనలకు వెళుతున్నట్టు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాహుల్ తన జీవితకాలంలో ఆరెస్సెస్‌ను అవగాహన చేసుకోలేరని అన్నారు.
ఆరెస్సెస్ దేశ విలువలు, సంస్కృతితో పెనువెసుకుందని ఇది ఆయనకు అర్ధం కాదని పేర్కొన్నారు. కాగా రాహుల్ గాంధీ టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరెస్సెస్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ భారత్ ఒకే ఆలోచనకు సంబంధించిందని ఆరెస్సెస్ భావిస్తుందని, కానీ తాము భారత్ విభిన్న ఆలోచనలకు వేదికగా భావిస్తామని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ దాడికి తెగబడుతున్నారని ప్రజలు గ్రహించడంతో లోక్‌సబ ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం జరిగిందని గుర్తుచేశారు.
Read More :
Sanatan Pradhan | పేదరికాన్ని ఓడించిన సంకల్పం.. నీట్లో సత్తా చాటిన ఒడిశా గిరిజన విద్యార్థి