Mpox | ఆఫ్రికా దేశాల్లో ‘మంకీపాక్స్’ (Mpox) వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఇప్పటివరకు 15 ఆఫ్రికా దేశాలకు వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా 600 మందికిపైగా మరణించగా, 15 వేల మంది దీని బారిన పడ్డారు. తాజాగా ఎంపాక్స్ వైరస్ ఆఫ్రికా బయట దేశాలకు కూడా విస్తరిస్తోంది. ఇప్పటికే పొరుగు దేశం పాకిస్థాన్‌లో కూడా ఎంపాక్స్ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వైరస్ భారత్‌లోనూ కలకలం సృష్టిస్తోంది.
భారత్‌లో మంకీపాక్స్ (Mpox) లక్షణాలున్న అనుమానిత కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ కట్టడి చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని, వారి కాంటాక్ట్ లిస్ట్‌ను తయారు చేయాలని సూచించింది. ఈ మేరకు సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేసింది.
కాగా, ఇప్పటికే ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన మంకీపాక్స్ (ఎంపాక్స్) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతనికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఎంపాక్స్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read..
Union Minister | రాహుల్ గాంధీ ఆరెస్సెస్‌ను తన జీవితకాలంలో అర్ధం చేసుకోలేరు : గిరిరాజ్ సింగ్
Rahul Gandhi | తెలుగు భాష చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది : రాహుల్ గాంధీ
Bajrang Punia | కాంగ్రెస్‌లో చేరిన రోజుల వ్యవధిలోనే.. బజరంగ్ పునియాకు బెదిరింపులు