Karnataka : కర్నాటక సీఎం పదవిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ వ్యవహారంపై కర్నాటక బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలందరికీ సీఎం సిద్ధరామయ్యను పదవి నుంచి తొలగిస్తారని తెలుసని వ్యాఖ్యానించారు. కర్నాటక సీఎం పదవిపై పలువురు కాంగ్రెస్ నేతలు కన్నేశారని అన్నారు. కర్నాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు.
ఇక అమెరికాలోని టెక్సాస్, డల్లాస్ సభల్లో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సీటీ రవి తోసిపుచ్చారు. దేశాన్ని అవమానించే క్రమంలో రాహుల్ గాంధీ తరచూ ఈ తరహా రాజకీయాలకు పాల్పడుతుంటారని దుయ్యబట్టారు. భారత్ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే సంస్ధపై రాహుల్ ఎప్పుడూ దుమ్మెత్తి పోస్తుంటారని దుయ్యబట్టారు. ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా చేస్తున్న విమర్శలేనని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి అన్నారు.
కాగా, రాహుల్ గాంధీ టెక్సాస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆరెస్సెస్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో భారత సంతతికి చెందిన వారిని ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ భారత్ ఒకే ఆలోచనకు సంబంధించిందని ఆరెస్సెస్ భావిస్తుందని, కానీ తాము భారత్ విభిన్న ఆలోచనలకు వేదికగా భావిస్తామని చెప్పుకొచ్చారు. భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ దాడికి తెగబడుతున్నారని ప్రజలు గ్రహించడంతో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా బలమైన పోరాటం జరిగిందని గుర్తుచేశారు.
Read More :
Shanvi Srivastava | మాల్ధీవుల్లో ఎంజాయ్ చేస్తున్న శాన్వీ శ్రీవాత్సవ..