Headingley Test : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్(137), వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) శతకాలతో భారీ స్కోర్‌కు బాటలు వేశారు. టీ సెషన్ తర్వాత పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు గిల్ సేనను కట్టడి చేశారు. జోష్ టంగ్ విజృంభణతో టెయిలెండర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం ఆతథ్య జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే(12 నాటౌట్), బెన్ డకెట్(9 నాటౌట్) వికెట్ కాపాడుకున్నారు. దాంతో, నాలుగో ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 21 పరుగులు చేసింది. ఐదో రోజు ఆ జట్టుకు 350 రన్స్ అవసరం కాగా.. టీమిండియాకు పది వికెట్లు కావాలి. సో.. ఇరుజట్లకు తొలి సెషన్ కీలకం కానుంది.
లీడ్స్‌లోని హెడింగ్లేలో తొలి టెస్టు ఆద్యంతం ఉత్కంఠగా సాగుతోంది. నాలుగో రోజు కేఎల్ రాహుల్(137) క్లాస్ ఇన్నింగ్స్‌కు, వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(118) సూపర్ సెంచరీ తోడవ్వడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. నాలుగో వికెట్‌కు 195 రన్స్ జోడించిన ఈ ద్వయం.. టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపింది. అయితే.. టీ సెషన్ తర్వాత అనూహ్యంగా తడబడింది.
Stumps on Day 4 in Headingley 🏟️
England 21/0, need 350 runs to win
All eyes on the final day of the Test 🙌
Scorecard ▶️ https://t.co/CuzAEnBkyu#TeamIndia | #ENGvIND pic.twitter.com/MJOK5iFmBG
— BCCI (@BCCI) June 23, 2025
కొత్త బంతితో జోష్ టంగ్(3-72) చెలరేగగా.. 31 పరుగుల వ్యవధిలోనే గిల్ సేనచివరి ఆరు వికెట్లు కోల్పోయింది. బషీర్ బౌలింగ్‌లో ప్రసిధ్ కృష్ణ బౌండరీకి యత్నించి ఔటయ్యాడు. దాంతో, 364 వద్ద గిల్ సేన ముగిసింది. అనంతరం 371 వపరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోకుండా 21 రన్స్ చేసింది.