Red Bananas | షుగర్ ఉన్నవారికి దివ్య ఔషధం ఈ పండ్లు.. ఇంకా ఎన్నో లాభాలు..!
అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ప్రత్యేకంగా వీటికి ఒక సీజన్ అంటూ ఏమీ ఉండదు. అనారోగ్యంగా ఉన్నవారు చాలా మంది అరటి పండ్లను శక్తి కోసం తింటారు.
Red Bananas | అరటి పండ్లు మనకు ఏడాది పొడవునా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ప్రత్యేకంగా వీటికి ఒక సీజన్ అంటూ ఏమీ ఉండదు. అనారోగ్యంగా ఉన్నవారు చాలా మంది అరటి పండ్లను శక్తి కోసం తింటారు. దీంతో రోగం నుంచి త్వరగా కోలుకోవచ్చని భావిస్తారు. అరటి పండ్లను తినడం వల్ల శక్తి లభించడమే కాక పోషకాలు కూడా అందుతాయి. క్రీడాకారులు సైతం తక్షణ శక్తి కోసం అరటి పండ్లను తింటుంటారు. అయితే మనకు సాధారణంగా లభించేవి పసుపు రంగులో ఉండే అరటి పండ్లు. కానీ ఈ పండ్లలోనూ అనేక రకాల వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒక రకమే ఎరుగు రంగు అరటి పండ్లు. ఇవి కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, పసుపు రంగు పండ్లకు, వీటికి తేడా ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు అధికం..
ఎరుపు రంగు అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిల్లో కెరోటినాయిడ్స్, ఆంథో సయనిన్స్ అధికంగా ఉంటాయి. అందువల్లే ఈ అరటి పండ్ల తొక్క ఎరుపు రంగులో ఉంటుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వీటి తొక్కకు ఎరుపు రంగు ఉంటుంది. అందువల్ల ఎరుపు రంగు అరటి పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. దగ్గు, జలుబు తగ్గుతాయి. శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్ నిర్మూలించబడతాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి, అంతర్గత వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె జబ్బులు, ఇతర ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది.
కంటి చూపు పెరిగేందుకు..
ఈ అరటి పండ్లలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెటబాలిజంను మెరుగు పరుస్తుంది. క్యాలరీలు ఖర్చయ్యేలా చేస్తుంది. దీంతో కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఈ పండ్లలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఈ పండ్లలో అధికంగా ఉండే బీటా కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కంటి చూపును మెరుగు పరుస్తుంది. కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఎరుపు రంగు అరటి పండ్లలో విటమిన్ కె అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగకుండా సురక్షితంగా ఉండవచ్చు.
డయాబెటిస్ సమస్యకు..
ఎరుపు రంగు అరటి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఈ పండ్లలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఎరుపు రంగు అరటి పండ్లలో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంతోపాటు జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. జీర్ణ శక్తి పెరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు రంగులో ఉండే అరటి పండ్లను తింటే షుగర్ లెవల్స్ పెరుగుతాయి. కానీ ఎరుపు రంగు అరటి పండ్లను తింటే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఎందుకంటే వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ తక్కువగా ఉంటుంది. పైగా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి కనుక ఈ పండ్లను తింటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా ఎరుపు రంగు అరటి పండ్లను తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- red bananas
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

