రామవరం, జూన్ 23 : క్రమశిక్షణకు మారుపేరు, నిబద్ధతకు నిలువుటద్దం వంగాల శ్రీనివాస్ (56) మరణం ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్కి తీరని లోటు అని సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష అన్నారు. సింగరేణి కొత్తగూడం ఏరియాలో సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహించే శ్రీనివాస్ అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. ఆయన మృతికి సంతాప సూచకంగా ఏరియాలోని ఎస్ అండ్ పి సి కార్యాలయంలో సంతాప సభను నిర్వహించారు. ముందుగా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందడం బాధగా ఉందని, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ఫిట్ సెక్రటరీ మోహన్ రెడ్డి, జూనియర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, షిఫ్ట్ జమిందార్, కె.కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ హానోక్ రాజ్, యాక్టింగ్ క్లర్క్ సురేశ్, ఏ ఐ టి యు సి ఫిట్ సెక్రటరీ జె.రాంబాబు, మల్లికార్జున్, మైసరాజేశ్, కోడి నవీన్ , క్రాంతి, కప్పల శ్రీనివాస్, పిట్టల చంద్రమోహన్, సుద్దాల శంకర్, ప్రైవేట్ సెక్యూరిటీ నూకరాజు, ఈశ్వర్, కిరణ్, జూల రాజేశ్, ప్రైవేట్ సెక్యూరిటీ, డ్రైవర్లు పాల్గొన్నారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. స్వస్థలం ఇల్లందులో మంగళవారం అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.