ఢిల్లీ: ఖోఖో ప్రపంచకప్‌లో భారత పురుషుల, మహిళల జట్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 70-38తో పెరూపై విజయఢంకా మోగించింది.
ఆడిన మూడు మ్యాచ్‌లలో భారత్‌కు ఇది మూడో విజయం కావడంతో మన జట్టు క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. మహిళల విభాగంలో భారత్.. 100-16తో ఇరాన్‌ను చిత్తు చేయడంతో క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఏకంగా 175-18తో దక్షిణ కొరియాను చిత్తుచిత్తుగా ఓడించారు.