Virat Kohli : పొట్టి ప్రపంచకప్‌లో విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా(Team India) కీలక పోరుకు సిద్ధమైంది. లీగ్ దశలో అదరగొట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) బృందం సూపర్ 8లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉంది. మెగా టోర్నీలో పెద్ద జట్లకు షాకిస్తున్న అఫ్గనిస్థాన్‌తో జూన్ 20న భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే.. ఈమ్యాచ్‌కు ముందు టీమిండియాను ఓపెనింగ్ సమస్య వేధిస్తోంది. లీగ్ మ్యాచుల్లో రోహిత్ జతగా ఇన్నింగ్స్ ఆరంభించిన విరాట్ కోహ్లీ(Virat Kohli) దారుణంగా విఫలమయ్యాడు.
వరల్డ్ క్లాస్ బ్యాటర్ అయిన విరాట్ మూడు మ్యాచుల్లో వరుసగా 1, 4, 0 రన్స్ స్కోర్ చేశాడంతే. దాంతో, కరీబియన్ గడ్డపై గొప్ప రికార్డు ఉన్న కోహ్లీ.. అఫ్గన్‌తో పోరులో ఫామ్ అందుకోవాలని యావత్ భారతావని కోరుకుంటోంది. ఐసీసీ టైటిల్ వేటను ఘనంగా ఆరంభించిన టీమిండియా టైటిల్ గెలవాలంటే కోహ్లీ ఫామ్ చాలా ముఖ్యం. ఒక్కసారి విరాట్ బ్యాట్ నుంచి రన్స్ వచ్చాయంటే అతడిని ఆపడం ఎవరితరం కాదు. ఎంతటి ఒత్తిడిలోనైనా ఇన్నింగ్స్ నిర్మించే విరాట్ పరుగుల వరద పారిస్తే రోహిత్ సేనకు తిరుగులేనట్టే.
సూపర్ 8 మ్యాచుల్లో అతడి నుంచి భారత జట్టు ఆశిస్తున్నది అదే. ఒకవేళ కోహ్లీ మళ్లీ విఫలమైతే మాత్రం బ్యాకప్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇన్నింగ్స్ ఆరంభించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఎప్పటిలానే కోహ్లీ మూడో స్థానంలో తన మార్క్ బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తాడు.
మెగా టోర్నీ లీగ్ దశలో భారత్, అఫ్గనిస్థాన్‌లు ప్రత్యర్థులను వణికించాయి. రెండు జట్లు అజేయంగా సూపర్ 8లో అడుగుపెట్టాయి. అందుకని రోహిత్ బృందం కాబూలీ టీమ్‌ను లైట్ తీసుకోవడం లేదు. ఆ జట్టు ప్రధాన పేసర్ ఫజల్ హక్ ఫారూఖీ (Fazalhaq Farooqi) పవర్ ప్లేలో బెంబేలెత్తిస్తున్నాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇప్పటికే టోర్నీలో అత్యధిక (12) వికెట్లు తీశాడు.
.@FazalFarooqi10 continues to breathe 🔥 with the ball and stay at the 🔝 of the #T20WorldCup. 👏#AfghanAtalan | #AFGvPNG | #GloriousNationVictoriousTeam pic.twitter.com/atEhwRCUhh
— Afghanistan Cricket Board (@ACBofficials) June 14, 2024
ఇక కెప్టెన్ రషీద్ ఖాన్ (Rashid Khan)తో పాటు యువకెరటం నూర్ అహ్మద్ (Noor Ahmed)సైతం స్పిన్ ఉచ్చు బిగించగల సమర్ధుడే. టర్నింగ్ పిచ్‌లకు నెలవైన విండీస్ గడ్డపై భారత బ్యాటర్లను వీళ్లు ఇరుకున పెట్టడం ఖాయం. చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 104 పరుగుల తేడాతో ఓడడం అఫ్గన్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి ఉంటుంది. అయితే.. సుదీర్ఘ అనుభమున్న హిట్‌మ్యాన్, కోహ్లీలు శుభారంభమిస్తే.. ఆ తర్వాత దంచేందుకు మిస్టర్ 360 సూర్యకుమార్, రిషభ్ పంత్, శివం దూబే, హార్దిక్ పాండ్యాలు ఉండనే ఉన్నారు.
జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలోని బౌలింగ్ యూనిట్ అయితే భీకర ఫామ్‌లో ఉంది. కుర్రాడు అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh) ఆదిలోనే వికెట్లు తీస్తూ బుమ్రా, సిరాజ్‌లపై ఒత్తిడి తగ్గిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా, స్పిన్నర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు.
అయితే.. ఇప్పటివరకూ బెంచ్‌కే పరిమితమైన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ (kuldeep yadav)కు చాన్స్ ఇస్తారా? లేదా? అనేది చూడాలి. గ్రూప్ 1 లో ఉన్న టీమిండియా సూపర్ 8 తొలి పోరు ముగియగానే జూన్ 22న బంగ్లాదేశ్‌తో, జూన్ 24న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మూడు మ్యాచుల్లో కనీసం రెండిటా జయభేరి మోగిస్తే రోహిత్ సేన సెమీఫైనల్ చేరినట్టే.
Into the Super 8s ✅
Captain Rohit Sharma speaks ahead of the Super 8s as #TeamIndia prepare for the next stage in the nets 🙌 – By @RajalArora
WATCH 🎥🔽 #T20WorldCup | @ImRo45 https://t.co/EF903a1BRp
— BCCI (@BCCI) June 18, 2024