Haris Rauf | పేలమైన ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్‌లో లీగ్ దశ నుంచి పాకిస్థాన్ జట్టు లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. దాంతో స్వదేశంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు అభిమానులతో పాటు ఇటు మాజీలు సైతం జట్టు ప్రదర్శనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పాక్ క్రికెటర్లు ఎక్కడ కనిపించినా వారిని వదిలిపెట్టకుండా మొహంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురవుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ సైతం ఓ అభిమానిపై దాడికి యత్నించగా.. పలువురు అడ్డుకున్నారు. ఈ ఘటన అమెరికా ఫ్లోరిడాలో చోటు చేసుకున్నది. హరీస్ రౌఫ్ తన భార్యతో కలిసి వెళ్తున్న సమయంలో కొందరు పాక్ అభిమానులు అతనిపై నోరుపారేసుకున్నారు. జట్టు ప్రదర్శనను విమర్శస్తు కామెంట్లు చేశారు. దాంతో సహనం కోల్పోయిన రౌఫ్ అభిమానిపై దాడి చేసేందుకు ఆగ్రహంతో పరుగు తీశాడు. అతడి భార్య అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. మాట వినకుండా సదరు వ్యక్తిపైకి వెళ్లాడు.
అక్కడే ఉన్న పలువురు రౌఫ్‌తో పాటు సదరు వ్యక్తికి నచ్చజెప్పి శాంతింపజేశారు. దాంతో రౌఫ్ సదరు వ్యక్తిని దూషించుకుంటూ వెళ్లాడు. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో రౌఫ్ ‘నువ్వు భారతీయుడివే కదా?’ అంటూ ఆగ్రహంతో ఊగిపోగా.. ‘కాదు నేను పాకిస్థానీని’ సదరు వ్యక్తి బదులిచ్చాడు. తనను విమర్శిస్తున్నది భారతీయుడేనని పాక్ క్రికెటర్ కొట్టడానికి వెళ్లిస్తున్నట్లు అర్థమవుతున్నది. ఇక టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ వైదొలిగినా.. ఇంకా పలువురు ఆటగాళ్లు అమెరికాలోనే ఉన్నారు. స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. స్వదేశానికి వెళ్లేందుకు సాహసించడం లేదు.
Haris Rauf Fight
His wife tried to stop her.
Haris- Ye indian ho hoga
Guy- Pakistani hu @GaurangBhardwa1 pic.twitter.com/kGzvotDeiA— Maghdhira (@bsushant__) June 18, 2024