Paris Olympics 2024 : ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు (India Hockey Team) గత వైభవాన్ని కొనసాగిస్తూ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి సెమీస్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టుబ్రిటన్ (Britan)పై అద్భుతం చేసింది. షూటౌట్లో 4-2తో బ్రిటన్‌పై జయభేరి మోగించి పసిడి పతకానికి రెండడుగుల దూరంలో నిలిచింది.
విశ్వ క్రీడల్లో జోరుమీదున్న భారత జట్టు గోల్డ్ మెడల్ వేటలో మరో అడుగు వేసింది. ప్రీ క్వార్టర్స్‌లో బలమైన ఆస్ట్రేలియాను 3-2తో ఓడించి 52 ఏండ్ల రికా ర్డు బ్రేక్ చేసిన భారత జట్టు బ్రిటన్‌పైనా పంజా విసిరింది. ఫుల్ టైమ్‌లో ఇరుజట్లు చెరొక గోల్(1-1) కొట్టాయి. స్కోర్ సమం కావడంతో, విజేతను నిర్ణయించేందుకు షూటౌట్ నిర్వహించారు. షూటౌట్లో తొలుత బ్రిటన్ ఆటగాళ్లు అల్బెరి జేమ్స్, వాల్లసె జాచ్లు గోల్ కొట్టగా.. విలియమ్సన్ కొనర్, రోపర్ ఫిలిప్లు బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపలేకపోయారు.
A famous victory!!!!
What a game. What a Shootout.
Raj Kumar Pal with the winning penalty shot.
We are in the Semis.
India India 🇮🇳 1 – 1 🇬🇧 Great Britain
SO: 4-2Harmanpreet Singh 22′ (PC)
Lee Morton 27′ #Hockey #HockeyIndia #IndiaKaGame #HockeyLayegaGold… pic.twitter.com/S01hjYbzGr
— Hockey India (@TheHockeyIndia) August 4, 2024
భారత జట్టు నుంచి మొదట కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్, ఉపాధ్యాయ్ లలిత్ కుమార్, రాజ్ కుమార్ పాల్లు గురి తప్పకుండా బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపారు. దాంతో, ఇండియా 4-2తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. బ్రిటన్ ఆటగాళ్లు కొట్టిన మొదటి రెండు గోల్స్ ఆపలేకపోయిన గోల్ కీపర్ శ్రీజేష్ చివరి రెండు గోల్స్‌ను సమర్ధంగా అడ్డుకున్నాడు. తద్వారా హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని టీమిండియా ఈసారి కనీసం కాంస్యం ఖరారు చేసింది.