Viral Video | పచ్చి కాఫీ గింజలను నమిలేశాడు
Viral Video : రోజూ ఉదయాన్నే కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే కాసింత కాఫీ గొంతు దిగనిదే చాలా మంది ఏ పనీ మొదలుపెట్టరు.
Viral Video : రోజూ ఉదయాన్నే కాఫీ తాగనిదే మనలో చాలా మందికి రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే కాసింత కాఫీ గొంతు దిగనిదే చాలా మంది ఏ పనీ మొదలుపెట్టరు. ప్రాంతానికో మోడల్, రంగు, రుచీ మారినా, అసలు ఫేవరెట్ పానీయాన్ని ఏ పేరుతో పిలిచినా కమ్మటి కాఫీ కడుపులోకి దిగందే పనిలోకి దిగమంటారు కాఫీ ప్రియులు. అలాంటి కాఫీ ప్రేమికుడు ఏకంగా పచ్చి కాఫీ గింజలను నములుతూ కాఫీ రుచులను ఆస్వాదిస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తన భర్త పచ్చి కాఫీ గింజలను జార్ నుంచి తీసుకుని వాటిని అమాంతం నమిలేస్తున్న వీడియోను ఓ వ్లాగర్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తతం ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరలవులోంది. ఈ క్లిప్‌లో తనకు కాఫీ అంటే ఎంత ఇష్టమో వివరించడంతో ప్రారంభమవుతుంది. నేను రోజూ నా మార్నింగ్ కాఫీ ఎలా తీసుకుంటారో చూడొచ్చు అంటూ అతను కిచెన్ షెల్ఫ్‌లోని జార్లోంచి పచ్చి కాఫీ గింజలను తీసుకుని నమలడం ఆ వీడియోలో కనిపిస్తుంది.
కాఫీ తయారుచేసుకోవడం కంటే ఇది చాలా సులభమని చెప్పుకొచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ నెట్టింట ఏకంగా 20 లక్షల వ్యూస్ లభించాయి. ఇది చిన్న పిల్లల ప్రవర్తన అంటూ ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ వ్యక్తి నేరుగా జైలుకు వెళ్లేందుకు అర్హుడని మరో యూజర్ జోక్ చేశారు. మరో కాఫీ లవర్ కాఫీని ఇలా తీసుకోవచ్చని తొలిసారిగా వింటున్నా అని రాసుకొచ్చారు.
Read More :
Sudha Kongara | సావర్కర్‌ను ఫూలేతో పోల్చినందుకు క్షమాపణలు చెప్పిన సుధా కొంగర
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

