Sudha Kongara | సావర్కర్‌ను ఫూలేతో పోల్చినందుకు క్షమాపణలు చెప్పిన సుధా కొంగర
Sudha Kongara | కోలీవుడ్ దర్శకురాలు ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర వీ.డి సావర్కర్ ను జ్యోతిరావు ఫూలేతో పోల్చినందుకు క్షమాపణలు తెలిపింది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం సర్ఫీరా. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు.
Sudha Kongara | కోలీవుడ్ దర్శకురాలు ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర వీ.డి సావర్కర్ ను జ్యోతిరావు ఫూలేతో పోల్చినందుకు క్షమాపణలు తెలిపింది. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం సర్ఫీరా. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించాడు. జూలై 12న విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌తో పరజయం పాలయ్యింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుధా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారి తీశాయి.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సుధా మాట్లాడుతూ.. భారతీయ రాజకీయ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్ అంటే నాకు చాలా అభిమానం. ఆయన పెళ్లి చేసుకున్న అనంతరం భార్యను చదివించాలని ఒత్తిడి చేసినా భార్య మాత్రం ఇంట్లోనే ఉండి గృహిణిగా ఉండాలనుకుంది. ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్లు చదువుకోలేదు. కాబట్టి, ఆమె పాఠశాలకు లేదా కళాశాలకు వెళ్ళినప్పుడు, వీధిలో అందరూ ఆమెను అవమానించారు. దీంతో అతడే ఆమెను పాఠశాలకు తీసుకెళ్లేవాడు. నా ప్రశ్న అక్కడ నుండి మొదలైంది అంటూ చెప్పుకోచ్చింది. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. ఇక జ్యోతిరావు ఫూలే చేసిన పనులను సావర్కర్ చేశాడని సుధ చెబుతుందని కనీసం చరిత్ర తెలుసుకోవలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఈ వివాదం ఇంకా ముదురుతుండడంతో సావర్కర్ ను జ్యోతిరావు ఫూలేతో పోల్చినందుకు క్షమాపణలు తెలిపింది.
నా తప్పును క్షమించండి. నాకు పదిహేడేళ్ల వయసులో, బాలికల విద్యపై నా క్లాస్‌లలో మా టీచర్ చెప్పిన దాని ఆధారంగా నేను ఇంటర్వ్యూ చేశాను. ఒక హిస్టరీ క్లాస్ స్టూడెంట్‌గా నేను ఫ్యాక్ట్ చెక్ చేసి ఉండాలి. ఇది నా పొరపాటు. భవిష్యత్తులో ఇలాంటివి జరగవని నేను హామీ ఇస్తున్నాను. జ్యోతిరావు ఫూలే చేసిన పనులకు సావర్కర్‌కు క్రెడిట్ ఇవ్వాలనే ఉద్దేశ్యం నాకు లేదు. నా ప్రసంగంలో తప్పుడు సమాచారాన్ని ఎత్తి చూపిన వారికి ధన్యవాదాలు. నేను జ్యోతిబాఫూలే సావిత్రిఫూలేకి ఎప్పటికీ గౌరవిస్తాను అంటూ చెప్పుకోచ్చింది.
என் தவறுக்கு வருந்துகிறேன். எனது பதினேழாவது வயதில் பெண் கல்வி குறித்த எனது வகுப்பு ஒன்றில் எனது ஆசிரியர் சொன்னதை வைத்து நான் அந்த நேர்முகத்தில் பேசியிருந்தேன். ஒரு வரலாற்று மாணவியாக அதன் உண்மைத் தன்மையை நான் சோதித்திருக்க வேண்டும். அது என் பக்கத்தில் தவறுதான். எதிர்காலத்தில்…
— Sudha Kongara (@Sudha_Kongara) July 27, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

