Lords Test : రెండో రోజే లార్డ్స్ టెస్టులో పట్టుబిగించిన భారత జట్టు(Team India) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. యస్తికా భాటియా(113) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. స్మృతి మంధాన(70), రీచా ఘోష్(50 నాటౌట్)లు అర్ధ శతకాలతో భారీ స్కోరందించారు. తొలి టెస్టు సెంచరీ కొట్టిన యస్తిక ఔటయ్యాక.. దూకుడుగా ఆడిన రీచా.. ఫిఫ్టీ పూర్తి చేసుకోగానే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 341 /7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్‌కు 457 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. చరిత్రాత్మక మ్యాచులో టాపార్డర్ మెరుపులతో ఇంగ్లండ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. ప్రత్యర్థిని 170కే పడగొట్టిన భారత్. రెండో ఇన్నింగ్స్‌లో రెచ్చిపోయింది. మూడో రోజు తొలి సెషన్లో యస్తికా భాటియా (113) సుదీర్ఘ ఫార్మాట్లో తొలి శతకంతో మెరిసింది.
Lord’s rises to applaud a special performance 🙌👏
Yastika Bhatia walks back after a historic 1️⃣1️⃣3️⃣(158) 💯
Updates ▶️ https://t.co/O1rEau8j8n #TeamIndia | #ENGvIND | @YastikaBhatia pic.twitter.com/duNLbKE6NC
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
మంధాన, భాటియా మెరుపులతో టీమిండియా ఆధిక్యం మూడొందలు దాటింది. అయితే.. మంధాన జెమీమా రోడ్రిగ్స్(3)లను ఔట్ చేసిన లారెన్ బెల్(2-27) ఆతిథ్య జట్టుకు బ్రేకిచ్చింది. కాసేపటికే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(16)ను ఎకిల్‌స్టోన్(5-118) ఎల్బీగా వెనక్కి పంపింది. టపటపా మూడు వికెట్లు పడడంతో యస్తిక, దీప్తి శర్మ(10)లు ఆచితూచి ఆడారు. దాంతో, 250-4తో లంచ్‌కు వెళ్లింది టీమిండియా.
Tea on Day 3️⃣ 🫖
Another solid batting effort means that #TeamIndia set England a target of 4️⃣5️⃣7️⃣ runs 🎯
Over to our bowlers! 👌
Scorecard ▶️ https://t.co/O1rEau8j8n #ENGvIND pic.twitter.com/MuSChWBIks
— BCCI Women (@BCCIWomen) July 12, 2026
అప్పటికి 91 పరుగులతో ఉన్న యస్తికా.. ఇసీ వాంగ్ ఓవర్లో సింగిల్‌తో టెస్టుల్లో మొదటిసారి మూడంకెల స్కోరందుకుంది. క్రీజునంటుకున్న దీప్తి, యస్తికలను వెనక్కి పంపిన ఎకిల్‌స్టోన్.. స్నేహ్ రానా(1)ను ఔట్ చేసి ఐదో వికెట్ సాధించింది. అనంతరం రీచా ఘోష్(52 నాటౌట్), సయాతీ సత్ఘరే(18 నాటౌట్)లు దూకుడుగా ఆడారు. 52 బంతుల్లో రీచా అర్ధ శతకం పూర్తి చేసుకోగానే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బాల్కనీ నుంచి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 115 పరుగుల ఆధిక్యం.. రెండో ఇన్నింగ్స్‌లో 341 రన్స్ కలిపి.. ప్రత్యర్థికి 457 రన్స్ లక్ష్యంగా నిర్దేశించింది భారత్.