IND vs CAN : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా (India), కెనడా (Canada)ల ఆఖరి లీగ్ మ్యాచ్ రద్దు అయింది. ఫ్లోరిడాలోని స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్ టాస్ వేయకుండానే రిఫరీ మ్యాచ్ రద్దు చేశాడు. దాంతో, ఇరుజట్లకు ఒక్కో పాయింట్ వచ్చింది. దాంతో, రోహిత్ సేన ఏడు పాయింట్లతో గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది. మూడు పాయింట్ల సాధించిన కెనడా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
భారత్, కెనడా మ్యాచ్‌కు వేదికైన ఫ్లొరిడాలో వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో షెడ్యూల్ ప్రకారం 7:30 గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు వాయిదా వేశారు. మరొకసారి అంపైర్లు, రిఫరీలు రాత్రి 8:00 గంటలకు ఔట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు.
India and Canada share a point each in Florida as match ends without a ball bowled.#T20WorldCup | #INDvCAN pic.twitter.com/1jXhe7rEvS
— ICC (@ICC) June 15, 2024
అప్పటికీ పరిస్థితి మెరుగవ్వలేదు. దాంతో, రాత్రి 9:03గంటలకు మళ్లీ ఔట్ ఫీల్డ్‌ను తేరిపారా చూశారు. కానీ, తడి ఏమాత్రం తగ్గలేదు. దాంతో, ఆటగాళ్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని అంపైర్లు ఇరుజట్ల కెప్టెన్లతో మాట్లాడారు. అనంతరం మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.