Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, చంద్రబాబు క్యాబినెట్లో పంచాయతీరాజ్ సహా కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం పవన్.. తన అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) కుటుంబాన్ని కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయనకు చిరంజీవి సతీమణి సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో.. సురేఖ స్వయంగా పెన్ను తీసి పవన్ జేబులో పెట్టారు. అది చూసి పవన్ తెగ సంతోషపడ్డారు. అప్పటికే ఆయన వద్ద ఉన్న పెన్ను తీసి చూపించగా, ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అన్నట్లు సురేఖ చెప్పారు. ఆ వెంటనే ఒకవైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్ సతీమణి అన్నా లెజినోవా వచ్చి ఫొటోకు ఫోజిచ్చారు.
‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ.. ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తులను మోంట్‌బ్లాంక్ అందిస్తుంది. లగ్జరీ పెన్నులు, రీఫిల్స్, బ్యాగ్స్, లెదర్ వస్తువులు, వాచీలు, సెంట్స్ తదితర గిఫ్ట్‌లను తయారుచేస్తుంది. సురేఖ.. పవన్‌కు ఇచ్చిన మోంట్ బ్లాంక్ డిస్నీ ఎడిషన్ పెన్నుల ధరల శ్రేణి రూ.90 వేల నుంచి రూ.2.60 లక్షల వరకు ఉంటుంది.
కళ్యాణ్ బాబుకు వదినమ్మ బహుమతి! 😍@PawanKalyan pic.twitter.com/vzt6rNX7gt
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 15, 2024