Kanpur Test : కాన్పూర్‌లో వరుసగా రెండో రోజు ఆట సాగలేదు. తొలి రోజు మూడో సెషన్లో మొదలైన వాన.. మరుసటి రోజు కూడా కొనసాగడం చూశాం. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితం అయ్యారు. ఇక మూడో రోజు వర్షం పడలేదు. అయినా సరే ఒక్క బంతి కూడా పడలేదు. ఔట్‌ఫీల్డ్(Wet Outfield) తడిగానే ఉండడం, మైదానంలో పటు చోట్ల నీళ్లు నిలవడంతో మ్యాచ్ రిఫరీ ఆటను రద్దు చేశారు. దాంతో, భారత్, బంగ్లాదేశ్ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేశారు.
నిరుడు వన్డే వరల్డ్ కప్ సమయంలో వాన పడినా గంటలోపే ఆట సాగిన దృశ్యాలు చూశాం. కానీ.. కాన్పూర్ స్టేడియంలో ఆ పరిస్థితి కనిపించలేదు. మూడో రోజు చినకు పడకున్నా సరే నిర్వాహకులు ఔట్‌ఫీల్డ్‌ను సిద్ధం చేయలేకపోయారు. దాంతో, ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వైఫల్యంపై అభిమానులు మండిపడుతున్నారు. రెండు రోజుల ఆట ఉన్నందున కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిసే అవకాశముంది.
UPDATE 🚨
Play for Day 3 in Kanpur has been called off due to wet outfield.#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/HPPxBMhY87
— BCCI (@BCCI) September 29, 2024
చెపాక్ టెస్టులో బంగ్లాదేశ్‌ను భారీ తేడాతో ఓడించిన భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పట్టికలో అగ్రస్థానం కాపాడుకుంది. అదే ఊపులో కాన్పూర్‌లోనూ జయభేరి మోగించాలని రోహిత్ సేన అనుకుంది. అయితే.. వర్షం రూపంలో దురదృష్టం టీమిండియాను వెంటాడింది. వరుసగా రెండు రోజులు ఆట సాగలేదు. నాలుగో రోజు పరిస్థితులు అనుకూలిస్తే.. బంగ్లాదేశ్ 107/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించనుంది.
ఇక మిగిలిన రెండు రోజుల్లో ఫలితం తేలడం అనుమానమే. దాంతో, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ టెస్టు డ్రా కావడం తథ్యం. అప్పుడు 2-0తో సిరీస్ సాధించి డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాల్ని మెరుగుపరుచుకోవాలనుకున్న భారత్‌కు పెద్ద షాక్ తగిలినట్టే. ప్రస్తుతం టీమిండియా టాప్‌లో ఉండగా.. ఆస్ట్రేలియా, స్వదేశంలో న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించిన శ్రీలంకలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
Sri Lanka improve their % further, while New Zealand slide down to seventh from fourth after the second Test in Galle #SLvNZ pic.twitter.com/S88wldb1t8
— ESPNcricinfo (@ESPNcricinfo) September 29, 2024
ఈ నేపథ్యంలో భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌ను ఓడించాలి. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియా హ్యాట్రిక్ కొట్టాలి. అప్పుడే రోహిత్ సేన ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశముంది.