ముంబై: స్వదేశం వేదికగా వెస్టిండీస్‌తో జరిగే టీ20, వన్డే సిరీస్‌ల కోసం బీసీసీఐ శుక్రవారం భారత మహిళల క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈనెల 15 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది. దేశవాళీలో రాణిస్తున్న ప్రతీక రావల్, తనూజ కన్వర్‌కు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కగా, ఆల్‌రౌండర్ రాగ్వి బిస్త్ టీ20 జట్టుకు మొదటిసారి ఎంపికైంది. స్టార్ ఓపెనర్ షెఫాలీవర్మ రెండు జట్లలో చోటు దక్కకపోగా, గాయాల కారణంగా యస్తికా భాటియా, శ్రేయాంక పాటిల్, ప్రియా పునియా దూరమయ్యారు.