న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై త్వరలో మొదలుకానున్న ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీకి సన్నాహకంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమ్ఇండియా..చారిత్రక సిరీస్‌పై కన్నేసింది. శనివారం జరిగే నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆసీస్‌పై గెలిచి తొలిసారి సిరీస్ దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్నది.
అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరిగే డై అండ్ నైట్ మ్యాచ్‌లో ఆసీస్‌పై పట్టు సాధించేందుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్సీలోని భారత్ పట్టుదలతో ఉన్నది. ఓపెనింగ్ జోడీ ప్రతికా రావల్, స్మృతి మందన సూపర్ ఫామ్ మీద ఉండటం జట్టుకు లాభిస్తున్నది.భారత్..ఫీల్డింగ్‌లో మరీ నాసిరకంగా తయారైంది.రెండు మ్యాచ్‌ల్లో 10 క్యాచ్‌లు జారవిడవడం ఆందోళన కల్గిస్తున్నది.