IND vs ENG : లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు పట్టుబిగించే అవకాశాన్ని కోల్పోయింది. మూడో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్ సెంచరీ(100)కి వైస్ కెప్టెన్ రిషభ్ పంత్(74), రవీంద్ర జడేజా (72)ల అర్ధ శతకాలతో చెలరేగిన వేళ మంచి ఆధిక్యం వస్తుందనిపించింది. కానీ, టెయిలెండర్ల వైఫల్యంతో చేజేతులా ప్రత్యర్థికి వికెట్లు ఇచ్చేసి పైచేయి సాధించే ఛాన్స్‌ను వదులకుంది. టీ సెషన్ తర్వాత వాషింగ్టన్ సుందర్(21 నాటౌట్)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జడ్డూను వోక్స్ వెనక్కి పంపగా.. ఆ తర్వాత ఆకాశ్ దీప్‌ను కార్సే ఔట్ చేశాడు. చివరి వికెట్‌గా సుందర్ వెనుదిరగడంతో 387కే గిల్ సేన ఆలౌటయ్యింది. దాంతో, ఆధిక్యం సాధించాలనుకున్న భారత జట్టు స్కోర్ సమం చేసిందంతే.
లార్డ్స్‌లో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. మూడో రోజు రిషభ్ పంత్(74), రెండో సెషన్లో కేఎల్ రాహుల్ (100) సెంచరీ తర్వాత ఔటైనా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రాహుల్ వికెట్‌తో ఇండియాపై ఒత్తిడి పెంచాలనుకున్న బెన్ స్టోక్స్ సేన వ్యూహాల్ని నితీశ్ కుమార్ రెడ్డి(31)లు చిత్తు చేశారు. కొత్త బంతితో హడలెత్తించినా సరే సమయోచితంగా ఆడుతూ.. స్కోర్ 300 దాటించారు. వీళ్లిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 62 రన్స్ జోడించగా టీ బ్రేక్ సమయానికి ఇండియా 5 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది.
Another vital contribution with the bat from Ravindra Jadeja 👊 pic.twitter.com/nweIURypV5
— ESPNcricinfo (@ESPNcricinfo) July 12, 2025
ఆ తర్వాత స్టోక్స్ ఓవర్లో నితీశ్ ఔట్ కాగా.. జడేజా ధనాధన్ ఆడి ఈ సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం చిట్టచివరి బ్యాటర్ వాషింగ్టన్ సుందర్( నాటౌట్) అండతో జట్టుకు ఆధిక్యాన్ని అందించాలనుకున్నాడు జడేజా. కానీ, వోక్స్ బౌలింగ్‌లో లెగ్ సైడ్ ఆడిన జడ్డూ వికెట్ కీపర్ జేమీ స్మిత్ చేతికి దొరికాడు. సిక్సర్‌తో అలరించిన ఆకాశ్ దీప్(7)ను కార్సే ఔట్ చేసి నిమిదో వికెట్ అందించాడు. ఆ వెంటనే బుమ్రా, సుందర్‌లు పెవిలియన్ చేరడంతో టీమిండియాకు ఆధిక్యం సాధించే అవకాశం చేజారింది.