Duleep Trophy : ఆద్యంతం ఉత్కంఠగా సాగిన దులీప్ ట్రోఫీలో ”ఇండియా ఏ'(India A) చాంపియన్‌గా నిలిచింది. ఇండియా సీ పై అద్భుత విజయంతో ట్రోఫీని అందుకుంది. మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) బృందం నాలుగో రోజు ‘ఇండియా సీ’ని 132 పరుగుల ఓడించి అగ్రస్థానంతో విజేతగా అవతరించింది. సాయి సుదర్శన్(111), రుతురాజ్ గైక్వాడ్(44)లు పోరాడినా ఇండియా సీకి గట్టెక్కించలేకపోయారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రత్యర్థిని హడలెత్తించంతో పాటు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన మయాంక్ సేన సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది.
అనంతపూర్ వేదికగా ఇండియా సీ, ఇండియా ఏ జట్లు ‘నువ్వానేనా’ అన్నట్టు తలపడ్డాయి. తొలుత శశ్వత్ రావత్(124), అవేశ్ ఖాన్(51 నాటౌట్)ల మెరుపులతో ఇండియా ఏ 297 పరుగులు చేయగలిగింది. అనంతరం అకీబ్ ఖాన్(3/43), అవేశ్ ఖాన్(3/63)లు చెలరేగి ఇండియా సీని 234కే నిలువరించారు. వికెట్ కీపర్ అభిషేక్ పొరెల్(82) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
That Winning Feeling! 🤗
India A captain Mayank Agarwal receives the coveted #DuleepTrophy 🏆
The celebrations begin 🎉@IDFCFIRSTBank
Scorecard ▶️: https://t.co/QkxvrUmPs1 pic.twitter.com/BH9H6lJa8w
— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో రియన్ పరాగ్(73), శశ్వత్ రావత్(52)లు ఇండియా సీ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మెరుపు హాఫ్ సెంచరీలు బాదారు. దాంతో, ప్రత్యర్ధికి మయాంక్ సేన 350 పరుగుల భారీ టార్గెట్ నిర్దేశించింది. పేస్ ద్వయం తనుష్ కొతియాన్(3/47), ప్రసిధ్ కృష్ణ(3/50)లు విజృంభణతో ఆ జట్టు 217కే కుప్పకూలింది. దాంతో, అగ్రస్థానానికి దూసుకెళ్లిన ఇండియా ఏ ట్రోఫీ విజేతగా అవతరించింది.
What a match. What a fight. What a win! 👌👌
The celebrations say it all 🔥🔥#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/QkxvrUnnhz pic.twitter.com/QpYoq2qYB7
— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024