Rabri Devi : బీహార్ రాష్ట్రం (Bihar state) లో ఎప్పుడూ ఆసక్తికర రాజకీయాలు నడుస్తుంటాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత (RJD chief) లాలూప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) తోపాటు ఆయన కుటుంబసభ్యులకు సంబంధించిన అంశాలు వైరల్గా మారుతుంటాయి. తాజాగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ (Tejashvi Yadav) తన తల్లి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి (Rabri Devi) కి సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
సోషల్ మీడియాలో రబ్రీదేవి వీడియోను చూసిన వారంతా రకరకాలుగా తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రబ్రీదేవి సాధారణ బీహారీ మహిళలా కనిపిస్తున్నారు. విసుర్రాయితో పప్పులు విసురుతూ, గోధుమలను జల్లెడ పడుతూ, వాటిని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజస్వి యాదవ్.. ‘జీవితాన్ని నడిపించేది తల్లి.. ఆశ, నమ్మకం, ప్రేమలకు ప్రతిబింబం తల్లి..’ అని క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వైరల్ వీడియోను చూసిన ఓ నెటిజన్.. ‘కుటుంబం, అధికారం రెండింటినీ ఎలా నడపవచ్చో ప్రపంచానికి చాటి చెప్పిన తల్లి ఆమె’ అని కామెంట్ చేశారు. ‘మీరు బీహార్ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను ఏకకాలంలో చూపించారని’ మరో నెటిజన్ రాసుకొచ్చారు. రబ్రీ దేవి పప్పు విసిరిన దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా వీక్షించవచ్చు.
जीवन का संबल है माँ! जीवन का आस-विश्वास, सार-प्यार, प्रतिमान और आर्शीवचन है माँ! #motherslove #mothers #trending pic.twitter.com/j7fYUwfvOE
— Tejashwi Yadav (@yadavtejashwi) September 22, 2024