Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిరంజీవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నాడని తెలిసిందే. డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు చిరంజీవి. ఇవాళ జరిగిన ఈవెంట్లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి Most Prolific Film Star (యాక్టర్/డ్యాన్సర్)అవార్డును అందుకున్నాడు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..డ్యా్న్స్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు అందరితో షేర్ చేసుకున్నాడు. నేను ఊహించనిది ఈ ఈవెంట్ ఇంత గ్లామర్‌గా మెమెరబుల్గా ఉందంటే కారణం నా మిత్రుడు అమీర్‌ఖాన్. ధన్యవాదాలు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేనెప్పుడూ ఊహించనిది. గిన్నీస్ బుక్కు మనకు ఏం సంబంధమనే ఆలోచన ఉంటుంది కదా సహజంగా.. నాకలాంటి ఆలోచన ఏం లేదు. అలాంటిది.. ఎదురుచూడనట్వంటి గొప్ప గౌరవం ఇవాళ నా సినీ ప్రస్థానంలో తారసపడినందుకు ఆ భగవంతుడికి.. దానికి కారణభూతులైన నా దర్శకనిర్మాతలు, అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నాడు.
నాకు నటన కంటే కూడా డ్యాన్స్ మీదున్న ఆసక్తి ఈ రోజు ఈ అవార్డ్ వచ్చేలా చేసిందా అని నాకనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను నటనకు శ్రీకారం చుట్టేకంటే ముందు డ్యాన్స్‌కు ఓనమాలు దిద్దానేమోననిపిస్తూ ఉంటుంది. నా చిన్నప్పుడు మా చుట్టూన్నవాళ్లను ఎంటర్టైన్ చేయడం కోసం అప్పట్లో ఉండే వివిధ భారతి, రేడియో సిలోన్ (శ్రీలంక రేడియో స్టేషన్ ) కానీ.. వీటిలో వచ్చే తెలుగు పాటలు మాకు ఇన్స్పిరేషన్. అప్పట్లో ఆర్థికంగా గ్రామ్‌ఫోన్, టేప్ రికార్డర్ కానీ ఉండే పరిస్థితి లేదు.
ఒక్కోసారి రేడియోలో పాటలు ఎప్పుడొస్తాయని అందరూ ఎదురుచూసేవారు. రాగానే శంకర్ బాబును పిలవండి.. డ్యాన్స్ చేస్తాడు.. మనల్ని అలరిస్తాడని వాళ్లంతా ఉత్సాహంగా ఉంటే.. నేను ప్రోత్సాహంగా తీసుకొని డ్యాన్స్ చేస్తుండేవాడినంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Mega Star #Chiranjeevi Garu is now a Guinness Record holder!@KChiruTweets Garu received the Guinness record for being the Most Prolific Film Star in Indian Cinema. He has been the star of Telugu cinema for a whopping 156 films in a span of 45 years, achieving an unbeatable feat… pic.twitter.com/dZ27wOMPez
— Vamsi Kaka (@vamsikaka) September 22, 2024
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్
Adivi Sesh | 2025లో మూడు సినిమాలట.. క్యూరియాసిటీ పెంచేస్తున్న అడివిశేష్
RT75 | ఆర్టీ 75 క్రేజీ న్యూస్.. రవితేజ ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడే..!