బెంగళూరులో జరుగుతున్న రెండో టెస్టులో తక్కువ స్కోర్లకే మయాంక్, రోహిత్, విహారి, కోహ్లీ అవుటవడంతో భారత జట్టు కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో కీపర్ పంత్ (39) భారీ షాట్లతో రెచ్చిపోవడంతో అభిమానులు సంతోషించారు.
అయితే 33వ ఓవర్లో కూడా అదే తరహా ఆట కనబరచబోయిన పంత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఎంబుల్డెనియా వేసిన ఈ ఓవర్ నాలుగో బంతిని కవర్స్ దిశగా పుష్ చేసేందుకు పంత్ ప్రయత్నించాడు. కానీ బంతి స్పిన్ అవడంతో పంత్ తడబడ్డాడు. దీంతో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
పంత్ వెనుతిరగడంతో జడేజా క్రీజులోకి వచ్చాడు. తొలి టెస్టులో భారీ ఇన్నింగ్సుతో అదరగొట్టిన జడేజా ఈ మ్యాచులో కూడా మంచి స్కోరు సాధిస్తేనే భారత జట్టు గట్టెక్కేలా ఉంది. పంత్ కూడా అవుటవడంతో 34 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 131/5 స్కోరుతో నిలిచింది.