భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో శ్రీలంక జట్టు మూడో వికెట్ కోల్పోయింది. మొదటి రెండు వికెట్లను అశ్విన్, జడేజా కూల్చగా.. తనేమీ తక్కువ కాదంటూ బుమ్రా మూడో వికెట్ కూల్చాడు. బుమ్రా కొద్దిగా షార్ట్ లెంగ్త్‌లో వేసిన బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన లంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (22) పెవిలియన్ చేరాడు.
యాంగిల్ కోసం మాథ్యూస్ ఆడుతుండగా.. లైన్లో వెళ్లిన బంతి మాథ్యూస్ బ్యాక్ ప్యాడ్‌ను తాకింది. భారత్ అప్పీలు చేయగా అంపైర్ అవుటిచ్చాడు. కానీ మాథ్యూస్ రివ్యూ కోరాడు. దీనిలో ప్యాడ్స్, అలాగే పిచ్ రెండింటిపై ఇంపాక్ట్ అంపైర్ కాల్‌గా నిర్ణయించారు. ఎత్తు విషయంలో కూడా అంపైర్ కాల్ ఇవ్వడంతో మాథ్యూస్ వెనుతిరగక తప్పలేదు. ఈ క్రమంలో 37 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక జట్టు 103/3 స్కోరుతో నిలిచింది.