టీమిండియాతో భారత్‌లో జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. లంక ఆటగాళ్లు టీ20 సిరీస్ కోసం ఇప్పటికే భారత్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్, శ్రీలంక మద్య మూడు టీ20ల సిరీస్ జరుగుతోంది. దీనిలో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో మ్యాచ్ శనివారం సాయంత్రం జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే మొహాలీ వేదికగా శ్రీలంక-భారత్ టెస్టు సిరీస్ ప్రారంభం అవుతుంది.
దీనికోసం శ్రీలంక క్రికెట్ బోర్డు 17 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించింది. రమేష్ మెండిస్‌ను ఎంపిక చేసినప్పటికీ చివరి నిమిషంలో గాయం కారణంగా అతన్ని తప్పించినట్లు సమాచారం. శ్రీలంక టెస్టు జట్టుకు దిముత్ కరుణరత్నే సారధ్యం వహిస్తాడు. కాగా, లంకతో జరిగే తొలి టెస్టు భారత జట్టు మాజీ సారధి విరాట్ కోహ్లీకి 100వ టెస్టు మ్యాచ్.
అంతేకాదు, టెస్టు క్రికెట్లో ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ.. కెప్టెన్సీ వదులుకున్న తర్వాత ఆడే తొలి టెస్టు మ్యాచ్ కూడా ఇదే. గత సఫారీ టూర్ తర్వాత టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే రోహిత్ శర్మకు టెస్టు జట్టు పగ్గాలు కూడా అందిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
శ్రీలంక జట్టు: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), పాథుమ్ నిశ్శంక, లాహిరు తిరిమన్నే, ఏంజెలో మాథ్యూస్, చరిత్ ఆసలంక, ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, నిరోషన్ డిక్వెల్లా, దినేష్ చండిమాల్, కుశాల్ మెండిస్, లాహిరు కుమార, సురంగ లక్మల్, దుష్మంత చమీర, విశ్వ ఫెర్నాండో, జెఫ్రీ వాండర్సే, ప్రవీష్ జయవిక్రమ, లసిత్ ఎబుల్డెనియా.
Sri Lanka Cricket’s Selection Committee selected 18 member squad to play the upcoming 02 match Test series vs India. 👇https://t.co/2EbxeBfA6C #INDvSL
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 25, 2022